నో మాస్క్.. నో పెట్రోల్..

by Sridhar Babu |
నో మాస్క్.. నో పెట్రోల్..
X

దిశ, కరీంనగర్: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) సోకకుండా ఉండాలంటే ప్రజలందరూ ఫిజికల్ డిస్టెన్స్(భౌతిక దూరం) పాటించడంతో పాటు విధిగా మాస్క్‌లు ధరించాలని సీఎం కేసీఆర్ నిన్నటి ప్రెస్ మీట్‌లోనూ చెప్పారు. కరీంనగర్ జిల్లాలోని కొన్ని బంకుల్లో మాస్కులు లేకుంటే పెట్రోల్, డీజిల్ అమ్మేది లేదని స్నష్టం చేస్తున్నారు. మాస్కుతో వస్తేనే పెట్రోల్ విక్రయిస్తామని తేల్చి చెప్తున్నారు. దాంతో వాహనదారులు విధిగా మాస్కు ధరించే ఆ బంకులకు వెళ్తున్నారు. అయితే, బయటకు వస్తే మాస్కు కంపల్సరీ అన్న నిబంధన విధించినా కొందరు పాటించడం లేదు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే
ప్రజలు తప్పక స్వీయ నియంత్రణతో భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.

కొవిడ్ 19 సోకడానికి ప్రధాన కారణం డ్రాప్ లెట్స్. సమీపంలోని వ్యక్తి తుమ్మినా, దగ్గినా వచ్చే డ్రాప్ లెట్స్ మరొకరి శరీరంలోకి వెళ్లినప్పుడు ఆ వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. తుమ్మడం లేదా దగ్గిన వ్యక్తిలో కరోనా లక్షణాలు ఉన్నా అతను కరోనా బాధితున్ని కలిసి వచ్చి ఆరోగ్యంగా ఉన్న వారిలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉందని గమనించే ప్రభుత్వం మాస్కులు తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని జయంత్ పిల్లింగ్ స్టేషన్, రామడుగు మండలం గోపాల్‌రావు‌పేట హెచ్‌పి బంక్ యాజమాన్యాలు వినూత్నంగా ఆలోచించాయి. మాస్కు లేకుండా తమ బంకులోకి వచ్చే వాహనాలకు పెట్రోల్, డీజిల్ అమ్మేది లేదని తేల్చిచెప్తున్నాయి. మాస్క్ లేకుంటే వినియోగదారులను తిప్పి పంపిస్తున్నామని అంటున్నారు. మాస్కు లేకుండా వస్తే పెట్రోల్ విక్రయించేది లేదని బోర్డులూ ఏర్పాటు చేశారు. దీంతో ఆ రెండు బంకులకు వెళ్లే కస్టమర్లు తమ పాకెట్‌లో డబ్బులు ఉన్నాయా లేవా అన్న విషయాని కన్న..మాస్కు ఉందా లేదా అన్న విషయానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ బంకులను కస్టమర్లు ‘‘నో మాస్క్ నో పెట్రోల్ బంకులు’’గా పిలుస్తున్నారు. సమాజ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు నడుం బిగిస్తే తెలంగాణ అంతా ఆరోగ్యవంతంగా
మారుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tags: wearing masks, compulsary, physical distance, petrol bunks, diesel, no mask no petrol

Advertisement

Next Story

Most Viewed