- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాజిటివ్ వచ్చిందని వ్యక్తి ఆత్మహత్య..
దిశ, జగిత్యాల : కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కొందరు తమకు ఎక్కడ కరోనా సోకుతుందేమో అనుకుని, పాజిటివ్ వచ్చిందని మానసిక ఆందోళనకు గురై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.కరోనాపై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడమే ఇలాంటి మరణాలకు కారణమవుతోందని తెలుస్తోంది. వైరస్ సోకిందని తెలియగానే ఇక తమ జీవితమే వ్యర్థమని కొందరు భావిస్తున్నారు. దీంతో బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలోని కోరుట్ల మండలం ఏకీన్ పూర్ గ్రామంలో గురువారం వెలుగు చూసింది.
వివరాల్లోకివెళితే.. తాజాగా నిర్వహించుకున్న టెస్టుల్లో పాజిటివ్ వచ్చిందని తెలిసి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లక్ష్మీ నర్సయ్య (32) ఇటీవల టెస్టులు నిర్వహించుకోగా పాజిటివ్ వచ్చింది. దీంతో భయాందోళనకు గురై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి కరోనా టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిందనే భయం కారణంగానే ఉరి వేసుకున్నాడా? మరే ఇతర కారణాల చేత ఉరివేసుకున్నాడా అన్నది ఇంకా తెలియరాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కోరుట్ల పోలీసులు వెల్లడించారు.