- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆకేరు వాగులో చిక్కుకున్న వ్యక్తి సేఫ్..
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. లక్షల ఎకరాల్లో పంట నీటి పాలవ్వగా, వరదల్లో చిక్కుకుని ఇప్పటికే పలువురు మృతిచెందారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు నర్సింహులపేట మండలంలోని ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఆకేరు వాగు పరిసర ప్రాంతాల్లో వైర్లు సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు కేబుల్ ఆపరేటర్ యాకయ్య వాగులో చిక్కుకున్నాడు. అది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారమిచ్చారు.
దీంతో హుటాహుటిన నర్సింహులపేట తహసీల్దార్ పున్నం చందర్, ఎస్ఐ నరేష్ ఘటన స్థలికి చేరుకున్నారు. సిబ్బంది సహాయంతో వాగులో చిక్కుకున్న యాకయ్యను సురక్షింతంగా బయటకు తీశారు. అయితే, సకాలంలో స్పందించి వ్యక్తి ప్రాణాలను కాపాడిన అధికారులను ప్రజలు అభినందించారు.