ఫ్రెండ్ దగ్గరకి వెళ్లొస్తానని అదృశ్యమయ్యాడు !

by Sumithra |   ( Updated:2020-10-29 08:58:55.0  )
ఫ్రెండ్ దగ్గరకి వెళ్లొస్తానని అదృశ్యమయ్యాడు !
X

దిశ, పటాన్‌చెరు: స్నేహితుని దగ్గరకు వెళ్లి వస్తానని చెప్పిన ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని ఇస్నాపూర్ తేజ కాలానికి చెందిన గంగారాం (23) పాశమైలారం పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో సూపర్ వైజర్‌గా పని చేస్తున్నాడు. గత ఆరునెలల క్రితమే ప్రేమ వివాహం అయ్యింది. కాగా ఈనెల 15న సాయంత్రం 5గంటల సమయంలో స్నేహితుడి దగ్గరకు వెళ్తున్నానని చెప్పిన గంగారాం ఇంతవరకు తిరిగి రాలేదు. గంగారం భార్య.. గంగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ప్రసాదరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed