టాక్టర్ ట్రాలీ తగిలి.. వ్యక్తి మృతి

by Sumithra |

దిశ, మెదక్: రోడ్డు ప్రమాదంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మాజీ చైర్మన్ మడుపు భూంరెడ్డి సోదరుడు మల్లారెడ్డి(60) మృతిచెందారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడలోని మల్లికార్జున స్వామి ఆలయం ఎదుట జరిగింది. మృతుడు సిద్దిపేటలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటూ.. స్వగ్రామంలో వ్యవసాయ పనులు చూసుకునే వాడు. బైక్‌పై మర్పడగకి వచ్చి తిరిగి వెళ్తుండగా.. ధాన్యం కొనుగోలు కేంద్రంలోకి వెళుతున్న ట్రాక్టర్ ట్రాలీ తగిలి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు ఆయనను సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు.

Tags: Person killed, road accident, tractor trolley, Grain buying center

Advertisement

Next Story

Most Viewed