- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదుపుతప్పిన బైకు.. యువకుడి మృతి
దిశ, మెదక్: ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన గల గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడగా అతన్ని వైద్యం కోసం ఆటోలో తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ ఘటన వెల్దుర్లి మండల పరిధిలోని మన్నెవారి జులాలాపూర్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. వెల్దుర్డీ ఎస్సై గంగరాజు కథనం ప్రకారం.. మానేపల్లి గ్రామానికి చెందిన రామచంద్రం ( 23 ) తన తల్లి నర్సమ్మతో కలిసి ద్విచక్ర వాహనంపై వెల్దుర్లి వెళ్ళాడు. తిరిగి సాయంత్రం తన ఇంటికి వస్తుండగా మన్నెవారి జూలాలాపూర్ వద్ద బైక్ అదుపు తప్పి గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతన్ని ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. మృతుడి తల్లి నర్సమ్మకు కూడా గాయాలయ్యాయి. రామచంద్రం తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Tags: bike accident, boy, died, slip down, medak, si gangaraju