- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొవిడ్ రికవరీ రోగుల్లో నిరంతర తలనొప్పి, మొహంపై వాపు
న్యూఢిల్లీ : దేశం ఓ వైపు కరోనా మహమ్మారితో పోరాడుతుంటే, మరోవైపు నుంచి బ్లాక్ ఫంగస్(మ్యుకరోమైకోసిస్) వ్యాధి దాడి మొదలుపెట్టింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో దీని కేసులు వెలుగుచూశాయి. ఈ క్రమంలో ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా బ్లాక్ ఫంగస్ లక్షణాల గురించి తెలిపారు. కొవిడ్ నుంచి కోలుకుంటున్నవారిలో నిరంతరమైన తలనొప్పి, మొహంపై ఒకవైపు వాపు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలని గులేరియా సూచించారు.
వీటితో పాటు నోటిలో రంగు మారడం, మొహంపై స్పర్శ తగ్గడం, నాసికా రంధ్రాలు మూసుకుపోవడం, పళ్లు లూజ్ అవడం వంటి లక్షణాలు కనిపించినా జాగ్రత్త పడాల్సిందేనని చెప్పారు. వెంటనే సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. భారత్‌లో ఎక్కువ మంది డయాబెటిక్ పేషెంట్లు ఉండటం, విచ్చలవిడిగా స్టెరాయిడ్స్ వినియోగం వల్ల ఈ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని అన్నారు. కొవిడ్ పేషెంట్లే కాకుండా, అన్ని వయసుల వారికీ ఈ వ్యాధి సోకే అవకాశముందన్నారు. 40 ఏళ్లు దాటిన డయాబెటిక్ పేషెంట్లకు మాత్రం ఎక్కువ ముప్పు ఉందని చెప్పారు.