సీఎంపై తిరగబడిన జనం.. ఉల్లితో దాడి!

by Anukaran |   ( Updated:2020-11-03 07:15:03.0  )
సీఎంపై తిరగబడిన జనం.. ఉల్లితో దాడి!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరుసార్లు బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీష్ కుమార్‌కు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు పరీక్ష పెడుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా సీఎం నితీష్ కుమార్‌కు ప్రజల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కొంటున్నారు. అది కూడా ఆయన ప్రచారానికి వెళ్లిన ర్యాలీల్లోనే జనాలు తిరగబడుతున్నారు. తాజాగా నితీష్‌కు మరో చేదు అనుభవం ఎదురైంది.

మధుబనిలోని హర్లాఖిలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో సీఎం నితీష్ మాట్లాడుతుండగా ఆయనపైకి జనం ఉల్లిపాయలు విసిరారు. అదికూడా ఆయన సరిగ్గా నిరుద్యోగం గురించి మాట్లాడటం ప్రారంభించగానే ఈ ఘటన చోటుచేసుకుంది. చూస్తుండగానే ఉల్లిపాయలు విసిరేవారి సంఖ్య పెరిగింది. దీంతో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది, నితీష్‌ను చుట్టు ముట్టి మీద ఆయన పడకుండా అడ్డుకున్నారు.

ముందుగా సభలో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి నితీష్‌పైకి ఉల్లిపాయలు, రాళ్లు విసిరాడు. ఆయన్ను చూసి మరికొందరు కూడా ఆయనపైకి ఉల్లిపాయలు విసరడం ప్రారంభించారు. భద్రతా సిబ్బంది వారిని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే, రాష్ట్రంలో మధ్య నిషేధం అమలులో ఉన్నప్పటికీ అమ్మకాలు మాత్రం జోరుగా సాగుతున్నాయంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సీఎంపై ముందుగా ఉల్లి, రాళ్లు విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా ”అతడిని అడ్డుకోకండి. విసరనివ్వండి. కావాల్సినన్ని విసరనివ్వండి” అని సీఎం నితీష్ భద్రతా సిబ్బందిని కోరారు.

Advertisement

Next Story

Most Viewed