- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్‌కు షాక్.. పల్లె ప్రగతిలో ఎదురు గాలి
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పల్లె ప్రగతి పంచాయతీ పెట్టింది. మంత్రులు గ్రామాల్లోకి వస్తుండటంతో నిరసనలు ఎదురవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే మిషన్భగీరథపైనే సీఎం సొంత జిల్లాలో నిరసన ఎదురైంది. మంత్రి హరీశ్‌రావును నిలదీశారు. దీంతో మంత్రి అలిగి వెళ్లిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె ప్రగతి గురువారం నుంచి మొదలుకాగా… మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్లు రోజుకో గ్రామానికి వెళ్లాలంటూ సీఎం సూచించిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో తొలి రోజున మంత్రి హరీశ్‌రావుకు నిరసనలు ఎదురుకావడంతో టీఆర్‌ఎస్‌నేతల్లో సందిగ్ధం నెలకొంది. ప్రతిరోజూ గ్రామాలకు వెళ్లాల్సి వస్తుండటంతో నిరసనలు ఎదుర్కొవాల్సిందేనా అనే ఆందోళన వ్యక్తమవుతోంది.
తొలిరోజు మంత్రులకు నిరసనలు
రాష్ట్రంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఆయా జిల్లాల్లో మంత్రులు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అయితే కొండపాక మండలంలోని తిప్పారం గ్రామంలో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతుండగానే పలువురు మహిళలు తాగునీటి సమస్య ఉందంటూ నినాదాలు చేశారు. మరికొందరు డబుల్ బెడ్ రూం ఇండ్లు కావాలని, ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. దీంతో ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసిన మంత్రి కారెక్కి వెళ్లిపోయారు.
మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో మంత్రి మల్లారెడ్డిని రైతులు అడ్డుకున్నారు. హరితహారంలో మొక్కలు నాటేందుకు వచ్చిన మంత్రిపై రైతులు ఆగ్రహంతో తిరగబడ్డారు. మంత్రికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. గతంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు 106 ఎకరాల భూమిని 38 మంది రైతుల దగ్గర నుంచి భూ సేకరించారని, 56 ఎకరాలు రాచకొండ పోలీస్ కమిషనరేట్ కోసం కేటాయించగా మిగిలిన 60 ఎకరాలను డెవలప్ చేసి ఎకరాకు వెయ్యి గజాలు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇంత వరకు పట్టించుకోవడం లేదని రైతులు నిరసనకు దిగారు. దీంతో మంత్రి మల్లారెడ్డి కూడా అసహనంతో వెనుదిరిగారు.
ఎలా వెళ్లేది..?
మరోవైపు గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నప్పటికీ నిధులు లేకపోవడంతో పనులు చేయడం లేదు. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో సర్పంచ్‌లు కూడా చేతులెత్తేస్తున్నారు. ఇప్పటికే లక్షల రూపాయల బిల్లులు పెండింగ్‌పడ్డాయి. వాటిని విడుదల చేయడం లేదు. మరోవైపు గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు, కొన్నిచోట్ల తాగునీటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. పల్లె ప్రగతి కింద ప్రతినెలా నిధులు ఇస్తున్నా వేతనాలకే సరిపోతున్నాయి. దీంతో గ్రామాల్లో చాలా మేరకు పనులు ముందుకు సాగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాలకు వెళ్లేందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు వెనకాడుతున్నారు. గ్రామాలకు వెళ్తే నిరసనలు ఎదురవుతాయనే ఆందోళనలో ఉంటున్నారు.
పది రోజుల పల్లె ప్రగతిలో ప్రతిరోజూ మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాలకు వెళ్లాలంటూ సీఎం కేసీఆర్ ఆదేశించడంతో తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తుంది. అయితే కొన్ని సమస్యలైనా తీర్చేందుకు తమ దగ్గర కూడా నిధులు లేకపోవడంతో ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు, మురికి కాల్వలపై ఎక్కువగా వినతులు వస్తున్నా… వాటికి నిధులిచ్చేందుకు ఎమ్మెల్యేల దగ్గర కూడా నిధులు లేవు. దీంతో పల్లె ప్రగతి కార్యక్రమాలు ప్రజాప్రతినిధులకు తలనొప్పి తెచ్చి పెడుతున్నాయి.