అడ్డంగా బుక్కైన కేసీఆర్… సోషల్ మీడియాలో వైరల్!

by Anukaran |   ( Updated:2021-07-30 05:25:07.0  )
telangana smart cities warangal karimnagar
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన దళితబంధు హామీ రాష్ట్రంలో పెను దుమారం రేపుతోంది. రాష్ట్రంలోని దళితులకు దళిత బంధు పేరుతో కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ హామీ ఎన్నికల కోసమేనని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. ఇందుకు సీఎం కౌంటర్ గా అవును ఎన్నికల కోసమే ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఆయన చేసిన ఈ ప్రకటనతో రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటూ అన్ని జిల్లాల్లోనూ డిమాండ్ పెరిగిపోతుంది. దీని నుండి ఎలా గట్టెక్కాలిరా బాబోయ్ అనుకుంటున్న టీఆర్ఎస్ పార్టీకి మరో కొత్త తలనొప్పి ప్రారంభమైంది. ఇతర సామాజికవర్గాల ప్రజలు కూడా కొత్త ప్రతిపాదనలు ముందుకు తెస్తున్నారు.

పలు సామాజిక వర్గాలు తమకు కూడా సాధికారిత ఇవ్వాలనే ప్రచారం మొదలుపెట్టారు. మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగమైనము, ఇదే రాష్ట్రంలో ప్రజలుగా బ్రతుకుతున్నాము, మా కులాల ఓట్లు ఉన్నాయి… మా కులాలకు కూడా ‘బంధు’ పేరుతో రూ.10 లక్షలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా ప్రతి కులం బంధు ఇవ్వాలని, మమ్మల్ని కూడా గుర్తించాలని సీఎంని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో అంతరించిన కులాలకు అభివృద్ధి నిధుల కేటాయింపు లేదు. ఆ కులాలల్లో అప్పు సప్పు చేసి చదివిన యువకులుకు ప్రభుత్వ నోటిఫికేషన్ లేదు, ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దళిత బంధు సూపర్… మా పరిస్థితి ఏందీ…?

అయ్యా సీఎం కేసీఆర్.. ఎస్సీల కోసం ‘దళిత బంధు’ బాగానే ఉంది. కానీ రాష్ట్రంలో నూటికి 90 శాతం మంది కులవృత్తుల మీద ఆధారపడి పూట గడుపేవారు ఉన్నారు. వాళ్ల పరిస్థితిపై ధ్యాస మీకు లేదా సార్? అంటూ ప్రశ్నిస్తున్నారు. వారి పరిస్థితులు మీ కంటికి కనిపించడం లేదా సారూ. అంతో ఇంతో కుల వృత్తులను నమ్ముకొని జీవనం సాగిస్తున్న కుమ్మరి, కమ్మరి, మెదరీ, మేర, చేనేతల పరిస్థితి దారుణంగా ఉంది. కరోనా మహమ్మారి వల్ల అనేక కులవృత్తులు అతలాకుతలమయ్యాయి. పూట గడవడమే కష్టంగా మారింది. నేతన్నలకు చేయూతనియ్యడానికి నిర్లక్ష్యం ఎందుకు, గీత కార్మికులు, నాయి బ్రాహ్మణులు, యాదవ కార్పొరేషన్, కుమ్మరి, విశ్వబ్రాహ్మణ, రజక, మత్స్యకారుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహారిస్తున్నారని ప్రశ్నలు వస్తున్నాయి. మనస్సు ఒప్పుత లేదా? మేము కూడా మీ రాష్ట్ర ప్రజలమే అనే ధ్యాస లేకుండా పోయిందా? అంటూ… కుల వృత్తులు నమ్ముకొని బ్రతుకే వారు సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారాలు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed