- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫిట్‌నెస్ కోసం జిమ్‌లో కుస్తీలు
దిశ, శేరిలింగంపల్లి: ఉరుకుల పరుగుల జీవితాలు. ఉదయం లేచినుండి మొదలు రాత్రి వరకు క్షణం తీరికలేని పనులు. దీంతో మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఉన్న కాస్త సమయంలోనే ఆరోగ్యం విషయంలో కాస్త కేర్ చూపెతున్నారు సిటీజనులు. ఫిట్ గా ఉండేందుకు జిమ్ ల బాట పడుతున్నారు. ఆడ, మగ తేడాలేకుండా జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం, సాయంత్రం నుంచి రాత్రి వరకు బ్యాచ్‌ల వారీగా వర్కవుట్స్ చేయిస్తూ ట్రెయినర్లు బిజీగా ఉంటున్నారు.
ఇది వరకు జిమ్ అంటేనే సెలబ్రెటీల కోసం అన్నట్లుగా ఉండే ది. క్రీడాకారులు, సినీ హీరో హీరోయిన్లు ఇతర బిజినెస్ ప్రముఖుల కోసం స్పెషల్ గా ఫిట్ నెస్ స్టూడియోలు ఉండేవి. కానీ, ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. స్థాయిని బట్టి అనుకూలంగా ఉన్నచోట జిమ్ లో చేరి వర్కవు ట్స్ చేస్తున్నారు. జిమ్ సెంటర్ల నిర్వహణలో ప్రముఖ సంస్థలు కూడా భాగస్వామ్యమవుతున్నాయి. ఐటీ సెక్టార్ మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి లాంటి ఏరియాల్లో ప్రముఖ సంస్థల ఫిట్ నెస్ సెంటర్లు వెలిశాయి.
పెరుగుతున్న శ్రద్ధ..
చలికాలంలో ఎక్కువగా ఫిట్ నెస్ పై దృష్టి పెడుతుంటారు. మార్నింగ్, ఈవినింగ్ వాకింగ్, చిన్న చిన్న వ్యాయామాలు చే స్తూ చలినుంచి ఉపశమనం పొందేందుకు ప్రయత్నిస్తుంటా రు. అన్ని కాలాల్లో వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం విషయంలో ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. కొందరు పార్కులు, స్టేడి యాల్లో వాకింగ్, జాగింగ్ లతో పాటు చిన్నచిన్న వర్కవుట్లతో సరిపెట్టుకుంటే, ఇంకొందరు జిమ్ లకు వెళ్లి ట్రెయినర్ల పర్యవేక్షణలో వర్కవుట్స్ చేస్తున్నారు. నగరంలో చాలాచోట్ల జిమ్ సెంటర్లు ఉదయం, సాయంత్రం బిజీగా ఉంటున్నాయి.
యోగా మొదలు డ్యాన్స్ వరకు..
కస్టమర్ల కోరికను బట్టి ట్రెయినర్లు వర్కవుట్స్ ప్లాన్ చేస్తు న్నారు. మజిల్స్, షోల్డర్స్, చెస్ట్ ఎక్సర్ సైజ్, బాడీ బిల్డింగ్ లాంటి వాటికి యూత్ లో మంచి క్రేజ్ కనిపిస్తుంది. లేడీస్ కోసం ప్రత్యేక వ్యాయామాలు చేయిస్తున్నారు. అందులోనూ మేల్, ఫీమేల్ కు డ్యాన్స్, ఏరోబిక్స్, జుంబాతో పాటు ఇతర డ్యాన్స్ లు చేయిస్తూ పలు రకాల వ్యాయామాలు ఉండేలా చూస్తున్నారు. కొన్నిచోట్ల వ్యాయామాలు, డ్యాన్స్ లతో పాటు యోగా పాఠాలు కూడా చెబుతున్నారు. లేడీస్ ట్రెయినర్లు అందుబాటులో ఉంటున్నారు.
డైట్ విషయంలోనూ శ్రద్ధ..
ఫిట్‌గా ఉండాలంటే అందుకు తగ్గట్టుగానే డైట్ పాటించాలంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు. వర్కవుట్స్‌తో పాటు డైట్ విషయంలోనూ సలహాలు, సూచనలు చేస్తామని చెబుతున్నారు. వ్యాయమాలతో పాటు తినే తిండి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని ట్రెయినర్లు పేర్కొంటున్నారు.
జిమ్ వచ్చేవారి సంఖ్య పెరిగింది: డేవిడ్, ట్రెయినర్
చాలాకాలంగా జిమ్ నిర్వహిస్తున్నా. గతంలోకంటే ఇప్పుడు జిమ్ కు వచ్చే వారి సంఖ్య పెరిగింది. కస్టమర్స్‌తో బాడీకి సరిపోయే వర్కవుట్స్ చేయి స్తుంటాం. యూత్ ఎక్కువగా మజిల్స్, సిక్స్ ప్యాక్ వర్కవుట్స్ అడుగుతుంటారు. వెయిట్ లాస్ కోసం చాలామంది వస్తుంటారు.
ఆరోగ్యమే ముఖ్యం: లచ్చన్న, ఉద్యోగి
ఎన్ని పనులు ఉన్నా ఆరోగ్యమే ముఖ్యం. ఇది వరకు ఇంటి దగ్గరే చిన్నచిన్న వర్కవుట్స్ చేసేది. ఈ మధ్యనే జిమ్ లో చేరా. నా బాడీ, నా ఇంట్రెస్ట్ ను బట్టి ఇక్కడ ట్రెయినర్ ఎక్సర్ సైజ్ లు చేయిస్తుంటారు. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఫిట్ గా ఉన్నా. వ్యాయామంతోనే ఆరోగ్యం సాధ్యం.