- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అది వట్టి ముచ్చటేనని ప్రజలకు తెలిసిపోయింది….
దిశ,సిద్దిపేట: కేంద్రం నుంచి నయా పైసా రాలేదని హరీశ్ రావు పదే పదే బుకాయిస్తున్నాడనీ, అదంతా వట్టి ముచ్చటేనని దుబ్బాక ప్రజలకు తెలిసి పోయిందని బీజేపీ నేత , మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘు నందన్ రావు భారీ మెజార్టీ తో గెలుపొందాలని కొమురవెల్లి మల్లన్న స్వామిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాల వల్ల దుబ్బాక ప్రాంతం ఎలా వెనక బడిందో ప్రజలకు గత నెల రోజులుగా వివరించామని అన్నారు. 23 పథకాల ద్వారా కేంద్ర నిధులు నేరుగా ప్రజలకు చేరుతున్నాయని చెప్పారు. బీజేపీ గెలిస్తేనే దుబ్బాక అభివృద్ది చెందుతుందని ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. తమ పార్టీ చేయాల్సిన మానవ ప్రయత్నం మొత్తం చేసిందన్నారు. తమ పార్టీ అభ్యర్థి గెలుపొందాలని మల్లిఖార్జున స్వామి ఆశీస్సులను తీసుకున్నానని తెలిపారు. ప్రజలు మెచ్చే పనులను మాత్రమే తమ పార్టీ చేస్తుందన్నారు. మద్యం, డబ్బులను టీఆర్ఎస్ పంచినా ప్రజలు బీజేపీకే ఓటు వేయాలని కంకణం కట్టుకున్నట్లు తెలిపారు.