ఆ సమయంలో ఏటీఎం వినియోగిస్తే పెనాల్టీ!

by Anukaran |
ఆ సమయంలో ఏటీఎం వినియోగిస్తే పెనాల్టీ!
X

దిశ, వెబ్‌డెస్క్ : మీ అకౌంట్‌లో సరిపడినంతా డబ్బులు లేవా..? అయినా మీరు ఏటీఎంలను వినియోగిస్తున్నారా…? అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే అకౌంట్‌లో డబ్బులు లేకున్నా ఏటీఎం కార్డులను వినియోగిస్తే.. బ్యాంకులు ఛార్జీల మోత మోగిస్తాయి. అవును. ఇది ఎప్పటి నుండో జరుగుతున్నా.. ఏటీఎం వినియోగదారులకు సరైన అవగాహన లేక పెనాల్టీలు కడుతున్నారు.

బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ లేక ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిలైన సందర్భాల్లో దేశంలోని వివిధ బ్యాంకులు పెనాల్టీ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇలా వినియోగిస్తే ఎస్బీఐ రూ.20లతోపాటు జీఎస్టీ వసూలు చేస్తోంది. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్, యాక్సిస్,మహేంద్ర బ్యాంకులు రూ.25లతోపాటు జీఎస్టీని వసూలు చేస్తున్నాయి. ఇలాంటి ఛార్జీలపై వినియోగదారులు పూర్తి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏటీఎం సెంటర్ కనబడగానే ట్రాన్సాక్షన్ చేయకుండా ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉన్నదో గుర్తుంచుకోని లావాదేవీలు చేయాలని బ్యాంకర్స్ అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed