- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బ్యాట్స్‌మెన్‌కు జరిమానా విధించండి : కపిల్
దిశ, స్పోర్ట్స్ : క్రికెట్ పూర్తిగా బ్యాట్స్‌మెన్ క్రీడగా మారిపోతుండటంపై దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ ఆందోళన వ్యక్తం చేశారు. మన్కడింగ్ ప్రదర్శించిన అశ్విన్‌పై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. క్రికెట్ స్పూర్తిని కేవలం బౌలర్లు మాత్రమే ఎందుకు కాపాడాలి. బ్యాట్స్‌మెన్ క్రికెట్‌లో భాగమే కదా? బౌలర్లు లేకుండా క్రికెట్ ఆడగలరా అని ఆయన ప్రశ్నించాడు. క్రికెట్ పూర్తిగా బ్యాట్స్‌మెన్ క్రీడ అయిపోతున్నది. బౌలర్ బంతి వేయకముందే పరుగు కోసం క్రీజ్ వదిలేసి వెళ్లిపోతుంటే అది క్రీడా స్పూర్తా? అని కపిల్ ప్రశ్నించారు. అశ్విన్, ఫించ్ ఘటనను గుర్తు చేస్తూ.. బ్యాట్స్‌మెన్ అలా క్రీజ్ వదిలి వెళ్లిపోతే తప్పకుండా జరిమానా విధించాల్సిందేనని ఆయన అన్నారు. ఈ విషయంలో ఐసీసీ తమ రూల్ బుక్‌లో పేర్కొన్నది. అయినా సరే మన్కడింగ్ వల్ల బౌలర్‌పై విమర్శలు రావడం సరికాదని కపిల్ అన్నారు. అవుట్ చేయకుంటే కనీసం బ్యాట్స్‌మెన్‌కు జరిమానా అయినా విధించేలా రూల్స్ మార్చమని ఆయన కోరాడు.