- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పెద్ద పేగులో ట్యూమర్.. ఇంకా ఆసుపత్రిలోనే పీలే
దిశ, స్పోర్ట్స్: బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే సావో పాలోలోని ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. పెద్ద పేగులో ట్యూమర్ ఏర్పడటంతో నెల రోజుల క్రితం ఆసుపత్రిలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆసుపత్రిలో చేరారు. వారం రోజుల పాటు ఆయనకు కీమో థెరపీ చేసిన అనంతరం.. పీలేకు సర్జరీ చేసి ట్యూమర్‌ను తొలగించారు. అప్పటి నుంచి ఆయన ఆసుపత్రిలోనే కోలుకుంటున్నారు. ఆ తర్వాత కూడా క్యాన్సర్ ముదరకుండా కీమో థెరపీ అందిస్తున్నారు. ఇక గురువారం చివరి సారిగా ఆయన కీమో చేశారు. ఈ విషయాన్ని పీలే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించారు.
‘ఈ ఏడాదికి నేను నా చివరి కీమో సెషన్ పూర్తిచేశాను. ఇది నా చికిత్సలో ఒక భాగమే’ అని ఆయన చెప్పారు. ఇదొక చిన్న విజయంలా భావించి సంబురాలు చేసుకుందామని అనుకొని మీతో పంచుకుంటున్నాను. నేను సంబరాలు చేసుకోవాలా వద్దా మీరే చెప్పండి అంటూ పీలే అభిమానులను ఇన్‌స్టాలో ప్రశ్నించారు. అయితే పీలేకు పూర్తిగా నయం అవడానికి కొన్ని రోజులు పడుతుందని.. అతడికి మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉందని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. అందుకే ఆయన మరికొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుందని వైద్యులు వెల్లడించారు. పీలే 1958, 1962, 1970లో బ్రెజిల్‌కు వరల్డ్ కప్ విజయాలను అందించారు. ఇప్పటి వరకు బ్రెజిల్ తరపున 92 మ్యాచ్‌లలో 77 గోల్స్ చేసి టాప్ పొజిషన్‌లో ఉన్నాడు.