- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నర్సంపేటలో అభివృద్ధి ఎంత.. ఇంకా ఏం చేద్దామంటూ ‘పెద్ది’ మీటింగ్
దిశ ప్రతినిధి, వరంగల్: నర్సంపేట నియోజకవర్గ మూడేళ్ల అభివృద్ధిపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశం విజయవంతమైంది. మునుపెన్నడూ లేనివిధంగా నియోజకవర్గ కేంద్రంలోనే జిల్లా ఉన్నతాధికారులతో ఆయా శాఖల అభివృద్ధి, సమస్యలు, చేపట్టాల్సిన పనులు, వివిధ అంశాలపై కలెక్టర్ గోపి సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యే పెద్ది దిశానిర్దేశం చేశారు. మండల స్థాయి అధికారి నుంచి జిల్లా ఉన్నతాస్థాయి అధికారుల వరకు దాదాపు ముఖ్యమైన శాఖల అధికారులు పాల్గొనడం గమనార్హం.
కొన్ని శాఖలకు సంబంధించిన రికార్డులు, నివేదికలు లేకపోవడంపై ఎమ్మెల్యే సదరు అధికారులను మందలించారు. అలాగే నివేదికలు సక్రమంగా తయారు చేయలేకపోయిన వారిపైనా ఇదే రీతిన వ్యవహరించారు. ప్రధానంగా 13 శాఖలపై చర్చ జరగగా వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ, మత్స్య, పశుసంవర్ధక, మిషన్ భగీరథ, వ్యవసాయ, హార్టికల్చర్ శాఖలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.
విజన్‌తో ముందుకెళ్లేందుకే…!
ఈ సందర్భంగా సమీక్షలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఎంతో వేగంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ముఖ్యంగా ఇరిగేషన్, వ్యవసాయం, మార్కెటింగ్, సహకార, వైద్య, విద్యతో పాటు నర్సంపేట పట్టణ అభివృద్ధి విషయంలో, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, ట్రైబల్ వెల్ఫేర్, విద్యా అంశాల్లో చాలా ముందుకు పోవడం జరిగిందని గుర్తు చేశారు. అభివృద్ధి పనులపై పునఃసమీక్షించుకుంటూనే చేపట్టాల్సిన పనులు, సమస్యలను గుర్తించి పరిష్కారం వైపు తీసుకెళ్లేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన పనుల ప్రతిపాదనలు, పెండింగ్ జాబితాను కనుక్కోవడంతో పాటు ఆయా శాఖల మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించనున్నట్లు వివరించారు. అధికారులతో సమన్వయం, ప్రజాప్రతినిధుల ద్వారా గ్రామా ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించడమే ప్రధాన ఉద్దేశమని అన్నారు. విజన్‌తో కూడిన అభివృద్ధి వైపు సాగడంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. తక్కువ సమయంలో అభివృద్ధిని ప్రజల కళ్ళముందు పెట్టాలనే సంకల్పంతో ముందుకు పోవడం జరుగుతోందని అన్నారు. నేటి సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిలో కీలకంగా మిగిలిపోతాయని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.
నివేదికలు.. నిర్ణయాలు..
నివేదికల రూపంలో సమాచారం తెలుసుకున్న జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలోనే.. ఏం చేద్దాం, ఎలా చేస్తే బాగుంటుందంటూ వెనువెంటనే సమస్యల పరిష్కారాలు, ప్రణాళికలు కనుక్కునే ప్రయత్నం చేయడం విశేషం. సమీక్షలో కొన్ని అంశాలపై అప్పటికప్పుడు ఆదేశాలు చేయడం.. నిర్ణయాలు తీసుకోవడం కనిపించింది. అంగన్‌వాడీ, ఇతర గ్రామస్థాయి అధికారిక కార్యాలయాల నిర్మాణాలకు ప్రభుత్వ భూమిని కేటాయించాలని ప్రతిపాదించారు. ధరణిలో 12 రకాల సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయని ఎమ్మెల్యే.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నాలా పర్మిషన్ సమస్యను వేగవంతంగా పరిష్కరించాలని సూచించారు. రైతు వేదికలకు మూత్రశాలలు తదితర పనులు గ్రామ పంచాయతీ నిధుల నుండి వాడుకోవచ్చని, ఏమైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత సర్పంచ్, కార్యదర్శి సంయుక్తంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. అధికారులు కొంత మంది కోర్టుకు సంబంధించిన వ్యవహారాలలో తగు జాగ్రత్తలు పాటించి, న్యాయ నిపుణుల సలహాలను తీసుకొని ఆస్తులను కాపాడుకోవాలని అన్నారు.
పెద్ది నూతన పంథాపై రాజకీయ వర్గాల్లో చర్చ..!
జిల్లా ఉన్నతస్థాయి అధికారులతో నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమీక్ష నిర్వహించడంపై ఆ పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. సాధారణంగా జడ్పీ మీటింగ్‌లో గానీ కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్‌లోనూ వివిధ శాఖలపై సమీక్ష నిర్వహిస్తుంటారు. అయితే అందుకు భిన్నంగా పెద్ది సుదర్శన్‌రెడ్డి నియోజకవర్గ కేంద్రంలో సమీక్ష నిర్వహించడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది. నియోజకవర్గ అభివృద్ధిపై పునఃసమీక్ష చేపట్టడం అనేది మంచి ఆలోచన అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరగడం విశేషం.
- Tags
- development