టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా.. టెన్షన్ లో కార్యకర్తలు

by Sridhar Babu |   ( Updated:2021-09-07 22:28:13.0  )
corona
X

దిశ, పెద్దపల్లి :పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. మంగళవారం స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేసుకోగా పాజిటివ్ అని తేలిందని ఆయన తెలిపారు. వెంటనే హైదరాబాదులోని యశోదా ఆస్పత్రిలోని వైద్యులను సంప్రదించి చికిత్స పొందుతున్నారు. గత నెల రోజులుగా హుజరాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా వీణవంక మండలంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రచార సమయంలోనే కరోనా సోకి ఉంటుందని పలువురు అంటున్నారు. ఆయనతో పాటు పర్యటనలో పాల్గొన్న కార్యకర్తలు అందరు కూడా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా దాసరి మనోహర్ రెడ్డి కోరారు.

Advertisement

Next Story