- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో ప్రజాస్వామ్యమే లేదు
దిశ, న్యూస్‌బ్యూరో: వేలాది మంది పోరాడి, ప్రాణ త్యాగం చేసి సంపాదించిపెట్టిన స్వాతంత్ర్యాన్ని నేడు ప్రజలు అనుభవిస్తున్నారని, కానీ దురదృష్టవశాత్తూ తెలంగాణలో అలాంటి స్వేచ్ఛ లేదని, మీడియాతో సహా ఎవ్వరికీ ఎలాంటి భావప్రకటనా స్వాతంత్ర్యం లేకుండా పోయిందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో పార్టీ తరఫున జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు.
ప్రజాస్వామ్యంలో నాలుగు మూల స్థంభాలను నిత్యం ఉటంకిస్తూ ఉంటామని, కానీ ఏ స్థంభానికీ తెలంగాణలో స్వేచ్ఛ లేకుండాపోయిందన్నారు. లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, మీడియా ఏ మేరకు స్వేచ్ఛగా పనిచేస్తున్నాయన్నది చర్చనీయాంశంగా మారిందని గుర్తుచేశారు. గడిచిన ఆరేళ్ళ పాలనను చూస్తే రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యమే లేదన్నారు. బడుగు, బలహీనవర్గాలపై నిత్యం దాడులు జరుగుతున్నాయని, అయినా ప్రభుత్వం తగిన న్యాయం చేయడంలో విఫలమవుతూ ఉందన్నారు.