పాక్ క్రికెటర్ల వేతనాలు భారీగా పెంపు

by Shyam |
పాక్ క్రికెటర్ల వేతనాలు భారీగా పెంపు
X

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ దేశవాళీ క్రికెటర్ల వేతనాలను భారీగా పెంచుతూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం బోర్డు ఒక ప్రకటన వెలువరించింది. ఈ నెల 30 నుంచి ప్రారంభమయ్యే 2020-21 సీజన్‌లో ఈ కొత్త వేతనాలు వర్తిస్తాయని పీసీబీ (Pakistan Cricket Board) స్పష్టం చేసింది. గత ఏడాది కంటే 7 శాతం అధిక వేతనం లభించనుంది. అత్యధికంగా అగ్రశ్రేణి ఆటగాడికి 3.2 మిలియన్ల పాక్ రూపాయలు లభించే అవకాశం ఉంది. ఇక అత్యల్పంగా 1.8 మిలియన్ పాక్ రూపాయలు అందుకోనున్నారు.

పెరిగిన వేతనాల వివరాలు

ఏ+ కేటగిరీలో 10 మంది ఆటగాళ్లకు నెలకు రూ. 1.50 లక్షలు (పాక్ కరెన్సీ)
ఏ కేటగిరీలో 38 మందికి నెలకు రూ. 85 వేలు
బీ కేటగిరీలో 48 మందికి నెలకు రూ. 75 వేలు
సీ కేటగిరీలో 72 మందికి నెలకు రూ. 65 వేలు
డీ కేటగిరీలో 24 మందికి నెలకు రూ. 40 వేలు

Advertisement

Next Story

Most Viewed