- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేటీఎం నుంచి 2 నిమిషాల్లో తక్షణ వ్యక్తిగత రుణం!
దిశ,వెబ్‌డెస్క్: ప్రముఖ చెల్లింపుల సంస్థ పేటీఎం తన వినియోగదారుల కోసం వ్యక్తిగత రుణాల సేవలను ప్రారంభించింది. సుమారు 10 లక్షల మంది వినియోగదారులకు కేవలం 2 నిమిషాల్లో వ్యక్తిగత రుణాలను అందించాలని, అదికూడా ఏడాది మొత్తంలో ఎప్పుడైనా సరే ఈ రుణాలను పొందే అవకాశముంటుందని పేటీఎం తెలిపింది. తీసుకున్న రుణాలను 18 నుంచి 36 నెలల్లోపు వాయిదా పద్దతిలో చెల్లించవచ్చని పేర్కొంది. పేటీఎం తక్షణ వ్యక్తిగత రుణం అందించేందుకు రెండు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలతో భాగస్వామ్యం ద్వారా నిర్వహించబడతాయని పేటీఎం పేర్కొంది. వినియోగదారులు ఎంపిక చేసుకునే వాయిదాను బట్టి ఈఎంఐను నిర్ణయిస్తారు. ఈ కొత్త సేవలతో బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న చిన్న చిన్న పట్టణాల వారికి ఆర్థిక సాయం అందుతుందని, రుణాల దరఖాస్తు కోసం ఎలాంటి పేపర్ డాక్యుమెంటేషన్ లేకుండా ప్రక్రియం మొత్తం డిజిటలైజ్ చేయబడిందని పేటీఎం తెలిపింది. ఈ తక్షణ వ్యక్తిగత రుణ సౌకర్యం ద్వారా అర్హత కలిగిన ఉద్యోగులు, చిన్న చిన్న వ్యాపారులతో పాటు మిగిలిన వారికి కేవలం 2 నిమిషాల్లో రూ. 2 లక్షల వరకు రుణాలను ఇవ్వనున్నట్టు పేటీఎం తన ప్రకటనలో వెల్లడించింది.