హనుమాన్ ఆరాధనలోనూ అన్నయ్యే స్ఫూర్తి

by Shyam |
హనుమాన్ ఆరాధనలోనూ అన్నయ్యే స్ఫూర్తి
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ హీరోగా.. పవర్ స్టార్‌గా ఎదిగాడు. అయినా సరే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే పవన్‌కు అన్నపై అభిమానం. పెద్దలంటే గౌరవం. కుటుంబం పట్ల ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు. జనం కోసం జనాల మధ్యకు వెళ్లిన పవన్.. ఇదంత పెద్దన్న చిరంజీవి ఇచ్చిన స్ఫూర్తే అని చెబుతారు. అయితే సినిమాలు, రాజకీయాలు మాత్రమే కాదు… దైవారాధనలోనూ చిరు తనకు స్ఫూర్తినిచ్చారని చెబుతున్నాడు పవన్..

ఏప్రిల్ 8వ తారీఖుతో తనకున్న అనుబంధాన్ని తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టాడు చిరంజీవి. లాటరీలో వచ్చిన హనుమాన్ బొమ్మతో తనకున్న బంధాన్ని వివరించాడు. దేవుడి పోలికలతో తాను ఉన్నానని తండ్రి చిన్నప్పుడే చెప్పాడని అప్పటి నుంచి హనుమాన్ బొమ్మను దాచుకున్నానని.. హనుమాన్ ఆరాధన చాలా ఇష్టమని తెలిపాడు చిరు.. ఈ పోస్ట్ పై స్పందించిన జనసేనాని… మా ఇంట్లో ఆంజనేయుడిని ఆరాధించేందుకు కారణం అన్నయ్యే అని తెలిపారు. హనుమాన్ జీ పూజతో నాస్తికుడిగా, కమ్యూనిస్ట్‌గా ఉన్న మా నాన్న రామ భక్తుడిగా మారిపోయాడని తెలిపారు. అంతే కాదు యువకుడిగా ఉన్నప్పుడు 108 సార్లు హనుమాన్ చాలీసా చదివానని అలనాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు.

Tags: Pawan Kalyan, Chiranjeevi, Hanuman, Tollywood

Advertisement

Next Story

Most Viewed