నిధులను దారి మళ్లిస్తున్నారు: పవన్

by srinivas |
Pawan
X

దిశ, ఏపీ బ్యూరో: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం భవన నిర్మాణ కార్మికులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి 13 జిల్లాల నుంచి 150 మంది భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఇసుక మాఫియాను ప్రభుత్వం అదుపు చేయకపోతే నిర్మాణ రంగం కుదేలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక విధానంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలనే ఈ ప్రభుత్వమూ చేస్తోందన్నారు. ఇసుక కొరత, కరోనా కారణంగా పనుల్లేక కార్మికులు అల్లాడిపోతున్నారని గుర్తు చేశారు. ఈ సమయంలో సంక్షేమ మండలి నిధులను ఇతర ప్రయోజనాల కోసం దారిమళ్లిస్తున్నారని పవన్ ఆరోపించారు. ఇసుక సరఫరాను సులభతరం చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలి ఆయన డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పవన్ భరోసా ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed