- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘డ్రైవింగ్ లైసెన్స్’పై కన్నేసిన పవర్ స్టార్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. హిందీ మూవీ “పింక్” రీమేక్ “వకీల్ సాబ్” తో సినీ ఇండస్ట్రీలోకి పవర్ ఫుల్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో ఫస్ట్ లుక్ కే సోషల్ మీడియా షేక్ కాగా.. ఇక సినిమా రిలీజ్ ఐతే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత క్రిష్, హరీష్ శంకర్ డైరెక్షన్ లో మూవీస్ చేయబోతున్న పవన్… మరో మలయాళీ హిట్ రీమేక్ పై కన్నేసినట్లు సమాచారం. 2019 డిసెంబర్ లో విడుదలై బాక్సాఫీసును కొల్లగొట్టిన సూపర్ హిట్ ఫిల్మ్ డ్రైవింగ్ లైసెన్స్ తెలుగులో రీమేక్ చేయబోతున్నారట.
పృథ్వి రాజ్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించనుండగా.. సూరజ్ పాత్రలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ లేదా విక్టరీ వెంకటేష్ నటించే ఛాన్స్ ఉందట. ఒకవేళ మేనల్లుడు తేజ్, పవన్ ల కాంబినేషన్ లో సినిమా వస్తే మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. లేదా పవన్, వెంకీ కాంబినేషన్ సెట్ అయితే… ఇది వీరిద్దరికీ రెండో సినిమా కానుంది.
డ్రైవింగ్ లైసెన్స్ కోసం హీరో, తన అభిమానికి మధ్య జరిగే పోరాటం సినిమా కథ కాగా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.