- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్జీవీకి ఫస్ట్ పంచ్.. 'పరాన్నజీవి' ఫస్ట్ లుక్ రిలీజ్
దిశ, వెబ్ డెస్క్: ఎప్పుడూ వివాదస్పద సినిమాలు తీస్తూ, వివాదాల్లో ఇరుక్కునే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’ నిసిమా తీస్తూ, మరో వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు కౌంటర్‌గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా రామ్ గోపాల్ వర్మపై ‘పరాన్న జీవి’ అనే సినిమా తీస్తున్న విషయమూ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతమంది కలిసి ఈ సినిమాకి ఫండింగ్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. ఇక ఇప్పటికే ఆర్జీవీని టార్గెట్ చేస్తూ ‘పరాన్నజీవి’ సినిమా నుంచి ‘పరాన్నజీవి.. జీవి నిర్జీవి ఆర్జీవీ..’ అంటూ సాగే ఓ పాటను రిలీజ్ చేసారు. ఇప్పుడు తాజాగా ‘పరాన్నజీవి’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. జబర్ధస్త్ కమెడియన్ షకలక శంకర్ ఈ సినిమాలో ఆర్జీవీగా కనిపించనున్నాడు.
ఇక ‘పవర్ స్టార్’ సినిమాని జూలై 25న ఉదయం 11 గంటలకు ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో రిలీజ్ చేస్తునట్టు వర్మ ప్రకటించగా.. ఈ పరాన్నజీవి సినిమాను కూడా అదే రోజు అదే సమయానికి శ్రేయాస్ ఏటీటీ ఫ్లాట్ ఫామ్‌లో రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా తెలియజేసింది.