- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లా నేస్తం పథకానికి జీవో ఇచ్చారు.. మరి నిధులు? : పవన్
దిశ, ఏపీ బ్యూరో: న్యాయవాదుల సంక్షేమ పథకం పై జనసేనాని పవన్ కళ్యాణ్ గళం విప్పారు. గత వారం రోజులుగా ప్రభుత్వం గతంలో చేసిన హామీలు, ఇచ్చిన జీవోల ఆధారంగా విమర్శలు గుప్పిస్తున్న పవన్ తాజాగా ‘లా నేస్తం’ పథకం ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. దాని రూ.100 కోట్ల ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, ఈ మేరకు జీవో కూడా జారీ చేసిందని ఆయన గుర్తు చేశారు. అయితే ఇప్పటి వరకు దానికి సంబంధించిన నిధులు మాత్రం విడుదల చేయలేదని ఆయన విమర్శించారు.
జూనియర్ న్యాయవాదుల కోసం ప్రకటించిన లా నేస్తం పథకాన్ని ఎందుకు కొనసాగించడంలేదని ప్రశ్నించారు. జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5 వేలు ఇస్తామన్నారని, గత 4 నెలలుగా ఈ పథకం అమలు జరిగి ఉంటే ఈ కష్టకాలంలో వారికి ఎంతో భరోసా లభించేదని ఆయన పేర్కొన్నారు. కరోనా ప్రభావంతో మేజిస్ట్రేట్ కోర్టుల నుంచి ఉన్నత న్యాయస్థానం వరకు అన్నీ విరామం ప్రకటించాయని, ఇలాంటి పరిస్థితుల్లో న్యాయవాదులు చాలీచాలని సంపాదనతో నెట్టుకొస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
లా చదివి ఉన్నతమైన వృత్తిలో ఉన్నా ఆర్థికంగా కుదురుకునే పరిస్థితి ఎక్కువమందికి లేదని ఆయన ప్రభుత్వానికి వివరించారు. కరోనా లాక్‌డౌన్ పరిస్థితుల కారణంగా క్లయింట్ల నుంచి ఫీజులు రాక 80 శాతం మంది లాయర్లు అరకొర సంపాదనతో అష్టకష్టాలు పడుతున్న విషయం తెలిసిందన్న ఆయన, బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులు ఓ వినతి పత్రాన్ని పంపారని గుర్తుచేశారు. జూనియర్లు, సీనియర్లు అనే తేడా లేకుండా ప్రతి ఒక్క న్యాయవాదికి 6 నెలల పాటు రూ.10 వేలు చొప్పున ఆర్థికసాయం అందజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కనీసం వడ్డీలేని రుణాలు మంజూరు చేసినా.. లాయర్ల పరిస్థితి మెరుగవుతుందని ప్రభుత్వానికి సూచించారు.