- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పది పరీక్షలు రద్దు చేయాలి: పవన్ కళ్యాణ్
దిశ, ఏపీ బ్యూరో: కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతున్నప్పటికీ పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. అన్ని జాగ్రత్తలతో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. తరగతి గదిలో కేవలం పది నుంచి పన్నెండు మంది విద్యార్థులను మాత్రమే కూర్చోనిస్తామని ఆయన చెప్పారు. మాస్కు తప్పని సరి అని ఆయన తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. కేవలం ఆరు రోజుల పాటే పరీక్షలు జరుగుతాయని ఆయన చెప్పారు. గతంలోలా సబ్జెక్టుకు పేపర్ 1, పేపర్ 2 ఉండవని, ఒకే పరీక్షా పత్రంలో రెండు పేపర్లకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులు సిద్ధంగా ఉండాలని సూచించారు.
విద్యాశాఖ మంత్రి ప్రకటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. కరోనా విజృంభిస్తున్న వేళ తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోందని అన్నారు. తెలంగాణ, తమిళనాడు, చత్తీస్ గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించలేదని, డిగ్రీ, పీజీ పరీక్షలే రద్దయిపోయాయని, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఉద్యోగ నియామక పరీక్షలు కూడా నిర్వహించడం లేదని, తెలంగాణలో పరీక్షల నిర్వహణకు కోర్టు
అంగీకరించలేదని అన్నారు.
పరీక్ష పేపర్ల సంఖ్య కుదించినా, విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లడం ప్రమాదకరం అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ప్రజా రవాణా వాహనాలే పూర్తిస్థాయిలో లేవని, ప్రైవేటు వాహనాలు కూడా సరిగా అందుబాటులో లేవని, ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రుల మనోభావాలను, విద్యార్థుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.