సింగర్ పర్ణిక ప్రైజ్‌మనీ చాలెంజ్

by  |   ( Updated:2020-06-25 03:46:45.0  )
సింగర్ పర్ణిక ప్రైజ్‌మనీ చాలెంజ్
X

‘జీ తెలుగు సారేగమప’తో లైమ్‌లైట్‌లోకి వచ్చిన సింగర్ పర్ణిక మాన్య.. ఆ తర్వాత తెలుగులో ప్లే బ్యాక్ సింగర్‌గా వరుస అవకాశాలు దక్కించుకుని మంచి గాయనిగా స్థిరపడింది. ‘అయిగిరి నందిని’ సింగిల్‌తో నెటిజన్లను ఆకట్టుకున్న పర్ణిక.. ఇటీవలే ‘తెలంగాణ స్వాగ్ యో’ పాటతో యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఇప్పటికే 50-60 సినిమాల్లో పాటలను కూడా పాడిన ఈ సింగర్.. తాజాగా ఓ చాలెంజ్‌తో మరోసారి మనముందుకొచ్చింది. అయితే ఇది టైమ్‌పాస్ చాలెంజ్ కాదు.. అక్షరాలా 20వేల రూపాయలు గెలుచుకునే ప్రైజ్ మనీ చాలెంజ్. మరి ఆ మనీ గెలుచుకోవాలంటే.. ఏం చేయాలి.

పాటలతో మెస్మరైజ్ చేసే పర్ణిక.. ప్రైజ్‌మనీ కోసం పాటల పోటీనే ఎంపిక చేసుంటుందని అందరూ భావిస్తారు. కానీ ఆమె వెరైటీగా ‘వంటల పోటీ’ని ఎంచుకుంది. ఇందుకోసం ఏం చేయాలో.. సింపుల్‌గా మూడు స్టెప్పుల్లో వివరించింది.

స్టెప్ 1 : మీకు వ‌చ్చిన స్పెషల్ వంట‌కాన్ని 2 నిమిషాలకు మించకుండా వీడియో తీయాలి.

స్టెప్ 2 : మన డిటేయిల్స్ ఇవ్వడంతో పాటు ఆ డిష్ చేయడానికి ఇన్‌స్పిరేషన్ ఎవ‌రో తెలియజేస్తూ, వారి గురించి కూడా ఓ రెండు మూడు మాటలు రాయాలి.

స్టెప్ 3 : “Cukzz Cooking Challenge 2020” అనే వ్యాఖ్యల‌తో వీడియో క్లోజ్ చేయాలి.

ఈ వీడియోను 9966299662 కు వాట్సాప్ చేయండి. లేదా [email protected] లో ఈ మెయిల్ చేయండి. మ‌రిన్ని వివ‌రాల కోసం www.cukzz.in ను సంప్ర‌దించండి అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వీడియోను షేర్ చేసింది ప‌ర్ణిక‌.

కాగా దేనికైనా రెడీ, బాడీగార్డ్, రభస, కవచం సినిమాల్లోని పాటలు ఆమెకు సింగర్‌గా మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.

https://www.instagram.com/p/CB0Z2AMnrxc/?utm_source=ig_embed&utm_campaign=loading

Advertisement

Next Story

Most Viewed