- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పర్యాటక ప్రదేశాల్లో పార్కింగ్ దోపిడీ
దిశ,తెలంగాణ బ్యూరో : వాహనదారులకు పార్కింగ్ బెడద తప్పడం లేదు. హైదరాబాద్‌లో ఎక్కడికెళ్లినా పార్కింగ్ దొరక్క ఇబ్బందులు పడుతుంటే, పార్కింగ్ రుసుం పేరిట దోచుకుంటున్న వారితో మరికొందరు ఇబ్బందులు పడుతున్నారు. షాపింగ్ మాల్స్, సినిమాహాల్స్‌లో పార్కింగ్ రుసుం వసూలు చేయొద్దని ప్రభుత్వం ప్రకటించినా కొన్ని చోట్ల దీని ఆచరణ అంతంతమాత్రంగానే ఉంది.
రాష్ట్రంలో పురావస్తు శాఖ పరిధిలో ఉన్న పర్యాటక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కేంద్ర పురావస్తు శాఖ ఆర్టీఏలో తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ సర్కిల్( తెలంగాణ)లో ఎలాంటి పార్కింగ్ స్టాల్స్ ఏర్పాటు చేయలేదని తెలిపింది. దీనికి సంబంధించి ఎలాంటి టెండర్ ప్రక్రియ కూడా జరపలేదని పురావస్తుశాఖ హైదరాబాద్ సర్కిల్ ఆఫీస్ పేర్కొంది. అంటే రాష్ట్రంలోని పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న ప్రదేశాల్లో పార్కింగ్ రుసుం వసూలు చేయడం విరుద్ధం. కానీ నగరంలోని గోల్కండ కోట, ఆర్కియాలజీ మ్యూజియం తదితర ప్రదేశాల్లో, వరంగల్ వెయ్యి స్తంభాల గుడి మరికొన్ని పర్యాటక ప్రాంతాల్లో పార్కింగ్ రుసుం వసూళు చేస్తున్నారు.
ఈ ప్రాంతాల్లో రూ.10 నుంచి రూ.50 వరకూ తీసుకుంటున్నారు. అయితే దీనిపై పర్యాటకులు ప్రశ్నించగా ఇది సంస్థ తరపున కాదని, తామే స్వతహాగా వాహనాల పార్కింగ్ కోసం స్థలాన్ని ఏర్పాటుచేసి పార్కింగ్ సౌకర్యాన్ని ఇచ్చి దానికి డబ్బులు తీసుకుంటున్నామని తెలిపారు.