- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పరిణీతి ఓవరాక్షన్.. నెటిజన్స్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అయింది. చెరుకు గడ ఎలా తినాలో తండ్రి పవన్ చోప్రా నేర్పిస్తున్న వీడియోను షేర్ చేసిన పరిణీతి.. ఫెయిల్ అయ్యానని తెలిపింది. నాన్న నుంచి కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్న ప్రతీసారి నెర్వస్‌గా ఫీల్ అవుతానని.. ఎందుకంటే నాన్న ప్రతీ విషయంలో పర్‌ఫెక్ట్‌గా ఉంటారని చెప్పింది. ఈ వీడియోపై అభిమానులు క్యూట్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తూనే.. ‘ప్రాక్టీస్ మేక్స్ పరిణీతి పర్‌ఫెక్ట్’ అని సలహాలు ఇస్తున్నారు. రోజూ షుగర్ కేన్ తినడం ప్రాక్టీస్ చేయమని చెప్తున్నారు. మరికొందరేమో మా ఏరియాలో అయితే చిన్న పిల్లలు కూడా చక్కగా చెరుకు గడ తినేస్తారని.. తను మాత్రం ఓవరాక్షన్ చేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా పరిణీతి ప్రస్తుతం హర్యానాలోని అంబాలలో వ్యవసాయ జీవితాన్ని ఆస్వాదిస్తోంది.
కాగా పరిణీతి సైనా నెహ్వాల్ బయోపిక్‌లో నటిస్తుండగా.. కొత్తగా మరో ప్రాజెక్ట్‌కు సైన్ చేసినట్లు తెలుస్తోంది. ‘ద గర్ల్ ఆన్ ద ట్రైన్’ డైరెక్టర్ రిభుదాస్ గుప్తా డైరెక్షన్‌లో యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నట్లు సమాచారం. ఇందులో పరిణీతి కోవర్ట్ ఏజెంట్‌గా కనిపించనుంది.