పసికందును అమ్మకానికి పెట్టిన తల్లిదండ్రులు

by Shyam |   ( Updated:2020-08-12 10:14:25.0  )
పసికందును అమ్మకానికి పెట్టిన తల్లిదండ్రులు
X

దిశ, మెదక్: విక్రయానికి పెట్టిన చిన్నారి అధికారుల చొరవతో తిరిగి తల్లిదండ్రుల చెంతకి చేరింది. వివరాళ్లోకి వెళితే.. మెదక్ జిల్లా మాసాయిపేటలో వడ్డెర కాలనీకి చెందిన పల్లపు పుష్పలత – శ్రీశైలం దంపతులకు మూడో సంతానంగా జూలై 4న బాబు జన్మించాడు. ఆ దంపతులు ఆర్థిక సమస్యల కారణంగా పుట్టిన బాబును అమ్మకానికి పెట్టారు.

ఈ విషయం తెలుసుకున్న ఎంపీటీసీ కృష్ణారెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ నాగరాజు, సొసైటీ డైరెక్టర్ నరసింహులు, వార్డు మెంబర్లు ఐసీడీఎస్ సూపర్వైజర్ శివ కుమారికి ఈ సమాచారం అందించారు. అందరూ కలిసి హుటాహుటిన వడ్డెర కాలనీకి వచ్చి బాబును అమ్మిన దంపతులకు, కొన్న దంపతులకు అవగాహన కల్పించారు. బాబును తిరిగి తల్లికి అప్పగించారు. మళ్లీ ఇలాంటి విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మళ్లీ విక్రయాలకు పాల్పడొద్దని తల్లిదండ్రుల నుంచి లిఖితపూర్వకంగా లెటర్ తీసుకన్నారు.

Advertisement

Next Story