- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'కలెక్టర్ గారు.. కిడ్నీ అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వండి'
దిశ, వెబ్ డెస్క్: ఆడపిల్ల చదువుకోవడమే తప్పు అనే రోజుల నుండి ఆడపిల్ల చదువే దేశానికి భవిష్యత్తు అనేంతగా తల్లిదండ్రుల ఆలోచనా విధానం మారింది. కానీ వారి ఆర్థిక పరిస్థితులు మాత్రం పిల్లల ఫీజులు కట్టలేక అప్పులు చేసే దగ్గరే ఆగిపోయింది. తాజాగా కూతురు చదువు కోసం కిడ్నీలను సైతం అమ్ముతామని ముందుకొచ్చిన ఓ తల్లిదండ్రుల కథ అనంతపురంలో వెలుగు చూసింది. అనంతపురం జిల్లా, హిందూపురంకు చెందిన మక్బుల్ జాన్, ఆయూబ్ ఖాన్ దంపతులు. వీరికి రుబియా అనే కూతురు ఉంది. ఆమె ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం చదువుతోంది. ఆమె ఫీజు కోసం ఈ దంపతులు ఎన్నో అప్పులు చేశారు. అలా కష్టపడి మొదటి సంవత్సరం ఫీజు కట్టారు.
రుబియాకు విదేశీ ఉన్నత విద్య స్కాలర్ షిప్ మంజూరు కాలేదు. దాని కోసం భార్యాభర్తలు రెండు నెలలుగా ప్రజా ప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగారు. ఎవ్వరూ ఆ తల్లిదండ్రుల గోడు వినలేదు. దీంతో వారిద్దరూ కూతురు చదువు ఆగిపోకూడదని ఒక కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు. తమ కిడ్నీలు అమ్మి తన కూతురు ఫీజు కట్టాలని అనుకుంటున్నామని, దానికి అనుమతి ఇప్పించవలసిందిగా కలెక్టర్‌ను వేడుకుంటున్నారు. ఈనెల 17వతేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉండటంతో కిడ్నీలు అమ్మకానికి అనుమతించాలని కోరారు. ప్రస్తుతంఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తిస్తుంది.