15నిమిషాల్లోనే మిస్సింగ్ కేసు ఛేదన..

by Sumithra |
15నిమిషాల్లోనే మిస్సింగ్ కేసు ఛేదన..
X

దిశ, వెబ్‌డెస్క్ : అమ్మాయి కనిపించడం లేదని 100 నెంబర్ కు ఫిర్యాదు అందిన 15నిమిషాల వ్యవధిలోనే ఆ కేసును పంజాగుట్ట పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. వెంటనే పెట్రోలింగ్ సిబ్బంది అప్రమత్తమై తమ వాహనం ద్వారా గాలింపు చర్యలు చేపట్టి అమ్మాయిని క్షేమంగా వారి కుటుంబసభ్యులకు అప్పగించారు.

ఈ విషయాన్ని పంజాగుట్ట SHO పోలీసులు ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఆ విషయాన్ని తెలంగాణ స్టేట్ పోలీసు విభాగం వారు కూడా రీ ట్వీట్ చేశారు. కాగా, తప్పిపోయిన అమ్మాయి ఎవరు అనే వివరాలను వారు వెల్లడించలేదు.

Advertisement

Next Story