కరోనా ఎంత పనిచేసింది.. రూ. 13 లక్షల కోట్లు నష్టం

by Harish |   ( Updated:2021-03-05 10:38:05.0  )
కరోనా ఎంత పనిచేసింది.. రూ. 13 లక్షల కోట్లు నష్టం
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగాలు పోవడం, ఇతర కారణాలతో దేశంలోని కుటుంబ ఆదాయం రూ. 13 లక్షల కోట్లు కోల్పోయినట్టు ఓ నివేదిక తెలిపింది. అంతేకాకుండా, వినియోగ డిమాండ్ మందగిస్తున్న నేపథ్యంలో 2021 మధ్య నాటిని ఆర్థికవ్యవస్థ నెమ్మదిస్తుందని యూబీఎస్ సెక్యూరిటీ ఇండియా హెచ్చరించింది.

2020-21 రెండు, మూడో త్రైమాసికాల్లో వృద్ధి రేటు సానుకూలంగా ఉండటం సంతోషించదగిందే అని, అయితే కరోనా వల్ల దేశంలోని చాలా కుటుంబాలు ఆదాయాలను కోల్పోవడంతో ఈ ఏడాది మధ్య నాటికి ఆర్థికవ్యవస్థ మందిగించే సూచనలు కనిపిస్తున్నాయని యూబీఎస్ సెక్యూరిటీ ఇండియా ఆర్థికవేత్తలు పేర్కొన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ 23.9 శాతం నుంచి మూడో త్రైమాసికానికి 40 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఈ ధోరని రికవరీ స్థిరత్వం, కొత్త పెట్టుబడుల పునరుజ్జీవనం, ఆర్థిక రంగంపై తగ్గే ఒత్తిడిపై ఆధారపడి ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. సాధారణ ఆర్థిక కార్యకలాపాలు కరోనా పూర్వస్థాయిని తిరిగి వచ్చినప్పటికీ రెండు, మూడు త్రైమాసికాల్లో వేగంగా కోలుకున్న తర్వాత ఇదే వృద్ధి వేగాన్ని కొనసాగించగలదా అనేది కీలకమని ఆర్థికవేత్తలు తెలిపారు.

Advertisement

Next Story