- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
LIC పాలసీదారులకు ముఖ్య గమనిక.. PAN అప్డేట్ వెంటనే చేసుకోండి..?
దిశ, వెబ్‌డెస్క్: అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ LIC (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) రానున్న రోజుల్లో అతి పెద్ద ఆరంభ పబ్లిక్ ఆఫర్ (IPO) సబ్‌స్క్రిప్షన్‌కు సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని పాలసీదారులకు అందించింది. వెంటనే అందరూ పాన్ కార్డ్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. పాన్ కార్డ్‌ను అప్‌డేట్ చేసుకోవడం వలన పాలసీదారులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎల్‌ఐసీ IPOలో పాలసీదారులకు 10 శాతం కేటాయించారు. ఎల్‌ఐసీ రికార్డులలో PANను అప్‌డేట్ చేసుకోవడం వలన ఈ ఐపీఓలో పాల్గొనే అవకాశం ఉంటుందని ఎల్‌ఐసీ ప్రకటించింది.
PAN అప్‌డేట్ లేని వాళ్ళకు ఐపీఓలో పాల్గొనే అవకాశం లేదని తెలిపింది. పాలసీదారులు ఐపీఓ లో పాల్గొనాలంటే తప్పనిసరిగా డీమ్యాట్ ఖాతా కలిగి ఉండాలి. డీమ్యాట్ అకౌంట్ లేని వాళ్ళకు ఎల్‌ఐసీ IPOకు అర్హత ఉండదని తెలిపింది. డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఐపీఓ లో పాల్గొనవచ్చని కంపెనీ తెలిపింది. ఎల్‌ఐసీ రికార్డులలో పాన్‌ను అప్‌డేట్ చేసుకోవడం వలన ముందస్తుగా భవిష్యత్తులో ఎలాంటి తప్పులు జరిగే అవకాశం ఉండదని అలాగే ఐపీఓలో పాల్గొనడం సులభం అవుతుందని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.
మీ పాన్ వివరాలను అప్‌డేట్ చేసుకోడానికి కింద ఇచ్చిన వెబ్‌సైట్‌ను చూడవచ్చు..
- కార్పొరేషన్ వెబ్‌సైట్ www.licindia.in లేదా https://licindia.in/Home/Online-PAN-Registration
2.https://linkpan.licindia.in/UIDSeedingWebApp/getPolicyPANStatus ను సందర్శించి మీ పాలసీలో మీ PAN నమోదు చేయబడిందా? లేదా అని చెక్ చేసుకోవచ్చు.