- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాలమూరులో ఈటల మార్క్.. బీజేపీలోకి ఆ ఇద్దరు..!
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్, టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఇటీవల గుడ్ బై చెప్పారు ఈటల.. ఈ నేపథ్యంలోనే సోమవారం బీజేపీలో చేరుతున్నారు. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఆయన వెంటే వచ్చేందుకు మరికొందరు నేతలు పావులు కదుపుతున్నారు. ఈటల రాజేందర్ వెంబడి ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు కూడా చేరనున్నారు. రాజేందర్ ప్రభావం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెద్దగా లేకపోయినప్పటికీ.. జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పలువురు ఈటలతో పాటు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
ఈటలకు తోడుగా అధికార పార్టీ రాష్ట్ర నాయకుడు
షాద్నగర్ నియోజకవర్గానికి చెందిన అందె బాబయ్య టీఆర్ఎస్‌లో రాష్ట్ర నాయకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముదిరాజ్ సంఘం నేతగా ఉమ్మడి పాలమూరు జిల్లా వారికి సుపరిచితులు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు గతంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఇన్‌చార్జీగా బాధ్యతలు నిర్వహించారు. ముదిరాజులు ఎక్కువ సంఖ్యలో ఉన్న మహబూబ్‌నగర్, నారాయణపేట, కొడంగల్, జడ్చర్ల తదితర నియోజకవర్గాల్లో పర్యటించి ముదిరాజ్ సామాజిక వర్గం ఓటర్లను ఆకర్షించారు. దాదాపుగా రెండు దశాబ్దాల నుంచి ఆయనకు ఉమ్మడి పాలమూరు జిల్లాతో అనుబంధం ఉంది. ఇటువంటి అందె బాబయ్య అధికార టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈటలతో కలిసి బీజేపీలో చేరేందుకు సన్నద్ధమయ్యారు. బాబయ్య పార్టీ మారడంతో ఆయన వెంటే మరికొంత మంది బీజేపీలోకి వచ్చే అవకాశాలు ఉండగా.. వనపర్తి జిల్లా వాసి, టీఎంయూ మాజీ రాష్ట్ర కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి సైతం ఈటలతో పాటు అదే పార్టీలో చేరుతుండడంతో రాజకీయ వేడి పుట్టిస్తోంది.
మరో కాంగ్రెస్ నేత..
భారతీయ జనతా పార్టీలో చేరేందుకు జిల్లా కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒకరు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఆ నాయకునితో బీజేపీ నేతలు ఇప్పటికే ఫోన్‌లో టచ్‌లో ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతుండడం, ఈటల వంటి నేతలు బీజేపీలో వస్తుండడంతో.. హస్తం నాయకులు కమలం గూటికి చేరుతున్నారని నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
వేచి చూసే ధోరణిలో మరికొందరు..
బీజేపీలో చేరే విషయంలో పలువురు నాయకులు, కార్యకర్తలు వేచి చూసే ధోరణిని అవలంభిస్తున్నారు. ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం మరో రెండున్నర ఏళ్ళకు పైగా అధికారంలో ఉంటుందని.. ఇటువంటి సమయంలో బయటకొచ్చి ఇబ్బందులు పడడం ఎందుకని పలువురు భావిస్తున్నట్టు సమాచారం. మరికొన్ని నియోజకవర్గాల్లో గత ఎన్నికల ఆశావహులు కూడా పార్టీ మారేందుకు బీజేపీ అధిష్టానంతో టచ్‌లో ఉంటున్నారు. సరిగ్గా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు జంప్ కావాలని కొందరు.. టికెట్ ఇవ్వకుంటే గుడ్ బై చెబుదామని మరికొందని యోచనలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. మొత్తానికి ఈటల బీజేపీలోకి చేరడంతో.. ఈ ప్రభావం ఉమ్మడి పాలమూరులో ఎంత మేర ఉంటుందో అని జిల్లా నాయకులు చర్చలు మొదలుపెట్టారు.