- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పాకిస్థాన్‌లో వెల్లివిరిసిన దీపావళి కాంతులు
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్ : పాకిస్థాన్‌లోని హిందువులు దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. దీపావళి పండుగ భారతీయులకు అత్యంత ప్రధానమైనది. మనదేశంలో ఉండే వారు అన్ని పండుగలను కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా జరుపుకుంటారు. కానీ, పాక్ లాంటి దేశంలో హిందూవులు పండుగలు జరుపుకోవాలంటే అక్కడి పరిస్థితులు వారికి అడ్డొస్తాయి. ఎప్పుడు వారి మీద ఎలాంటి దాడులు జరుగుతాయో అని బిక్కుబిక్కుమంటూ గడుపుతుంటారు.
కానీ, అలాంటిదేమీ లేకుండా దీపావళి రోజున కరాచీలోని స్వామి నారాయణ్ దేవాలయంలో హిందూవులు భక్తి శ్రద్ధలతో పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఆలయ ఆవరణలో రంగురంగుల ముగ్గులు వేసి, అందులో దీపాలు వెలిగించారు. ప్రత్యేక దీపాలతో అలంకరించడంతో ఆలయ ప్రాంగణమంతా వెలుగులతో మెరిసిపోయింది.
Next Story