- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రస్తుతం పాకిస్తాన్ ఏం చేస్తోందో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ప్రజలను కరోనా సంక్షోభం నుంచి ఎలా బయటపడేయాలా అని తిరుగులేని పోరాటం చేస్తోంటే.. పాకిస్తాన్ మాత్రం గుట్టుచప్పుడు కాకుండో మరో పనిచేస్తోంది. ఉగ్రవాదం విషయంలో ప్రపంచానికి ఎప్పుడూ అబద్ధాలు చెప్పే పాకిస్తాన్ ఇప్పుడు మరోసారి తన నీచబుద్ధిని బయటపెట్టుకుంది. తమ దేశంలో కరోనా సమస్యే లేదన్నట్లుగా.. అత్యవసరంగా ఉగ్రవాదుల జాబితాను సవరించింది. ఎందరో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను జాబితా నుంచి తొలగించింది. దాదాపు 1,800 మంది నిషేధిత ఉగ్రవాదుల్ని ఆ లిస్టు నుంచి గుట్టుచప్పుడు కాకుండా తొలగించేసింది. వీరిలో 2008 ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి, లష్కరే తొయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీర్ ఉర్ రెహ్మాన్ లఖ్వి కూడా ఉన్నట్లు సమాచారం. ఈ జాబితాను పాకిస్తాన్ మార్చి మొదటివారం నుంచి సవరిస్తూనే వస్తోన్నది. కానీ, కరోనా కట్టడి చర్యల్లో పడి చాలా దేశాలు గుర్తించలేదు. తాజాగా అమెరికాకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేసింది.
న్యూయార్క్ కేంద్రంగా పని చేస్తున్న క్యాస్టెల్లమ్ ఏఐ అనే సంస్థ పాకిస్తాన్ చేస్తున్న కుట్రను బయటపెట్టింది. ఈ కంపెనీ ఇచ్చిన సమాచారం మేరకు 2018లో నిషేధిత ఉగ్రవాదుల సంఖ్య 7600 గా ఉంది. ప్రస్తుతం ఈ సంఖ్య 3800కు చేరింది. 2018 నుంచే క్రమంగా ఉగ్రవాదుల జాబితాను సవరించుకుంటూ వస్తున్నారని.. ప్రపంచ దేశాల దృష్టి కరోనాపై పెట్టడంతో మార్చి నెల నుంచి ఏకంగా 1800 మందిని జాబితా నుంచి తప్పించినట్లు సదరు కంపెనీ వెల్లడించింది. ఒక దేశానికి నిషేధిత ఉగ్రవాదుల జాబితాను సవరించే అధికారం ఉంటుంది. కానీ, తప్పని సరిగా ఆ విషయాన్ని ఇతర దేశాలన్నింటితో పంచుకోవాలనే నిబంధన ఉంది. కానీ, పాకిస్తాన్ ఈ నిబంధనను తుంగలో తొక్కి తన ఇష్టానుసారంగా జాబితాను సవరించుకుంటూ వస్తోన్నది.
పాకిస్తాన్ ఇలా అత్యవసరంగా ఉగ్రవాదుల జాబితాను సవరించడం పలు అనుమానాలకు తావిస్తోందంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని కూడా ప్రచురించింది. అయినా పాకిస్తాన్ మాత్రం తన దుకుడును ఆపలేదు. తమకు ఇతర దేశాలు, సంస్థల నుంచి వచ్చే నిదులు ఆగిపోవడానికి దేశంలో నిషేధిత ఉగ్రవాదులు ఎక్కువగా ఉండటమే కారణమని భావించి.. ఇలా అక్రమాలకు తెరతీసింది. దొడ్డిదారిన నిషేధం ఎత్తివేసి నిధులు రాబట్టాలనే పథకం వేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం కరోనాపై పోరాటానికి కూడా నిధులు అవసరం కావడంతో పాక్ ఈ పన్నాగం పన్నినట్లు అర్థమవుతోందని ఎఫ్ఏటీఎఫ్‌కు చెందిన ఓ అధికారి అన్నారు.
Tags: Pakistan, Terrorists, Adjustment, Funding, Corona