- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పట్టు బిగిస్తున్న పాకిస్తాన్.. మూడోరోజూ ఆధిపత్యం
కరాచీ: సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్ జట్టు పట్టు బిగిస్తోంది. మూడోరోజూ ఆధిపత్యం చెలాయించింది. ఓవర్ నైట్ స్కోరు 308/8తో మూడో రోజైన గురువారం ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్థాన్ టెయిలెండర్లు ప్రత్యర్థి బౌలర్లకు ధీటుగా బదులిచ్చారు. హాసన్ అలీ(21), నౌమన్ అలీ(24), యాసిర్ షా(38*) రాణించడంతో ఓవర్ నైట్ స్కోరుకు మరో 70 పరుగులు జోడించి తొలి సెషన్‌లోపే జట్టు ఆలౌట్ అయింది. దీంతో పాకిస్థాన్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 158 పరుగుల ఆధిక్యం లభించింది. కగిసో రబాడా 3, కేశవ్ మహారాజ్ 3, ఎన్రిచ్ నోర్జే 2, లుంగి ఎంగిడీ 2 వికెట్లు తీసుకున్నారు.
అర్ధసెంచరీలతో రాణించిన మాక్రమ్, డస్సెన్
పాకిస్థాన్ ఆలౌట్ అనంతరం, రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా ఓపెనర్లు ఎయిడెన్ మాక్రమ్, డీన్ ఎల్గర్ మంచి ఆరంభాన్నిచ్చారు. లంచ్ సమయానికి వికెట్ నష్టపోకుండా 37 పరుగులు జోడించారు. అయితే, లంచ్ అనంతరం వీరి జోడీని యాసిర్ విడగొట్టాడు. అతడి బౌలింగ్‌లో మహమ్మద్ రిజ్వాన్‌కు క్యాచ్ ఇచ్చిన డీన్ ఎల్గర్(29), పెవీలియన్ చేరాడు. దీంతో సౌతాఫ్రికా 48 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన రస్సీ వాన్డర్ డస్సెన్‌తో కలిసి మరో ఓపెనర్ మాక్రమ్ ఇన్నింగ్స్ నిర్మించాడు. వీరిద్దరూ పాక్ బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ రెండో సెషన్ మొత్తం క్రీజులో పాతుకుపోయారు. రెండో సెషన్ అనంతరం అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్న మాక్రమ్(74), డస్సెన్ (64) మరింత నిలకడగా ఆడి, డ్రింక్స్ సమయానికి శతక భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, వీరి జోడికి యాసిర్ తెరదించాడు. అతని బౌలింగ్‌లో డస్సెన్ క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. దీంతో 175 పరుగుల వద్ద పర్యాటక జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన ఫాఫ్ డు ప్లెసిస్(10) ఎంతోసేపు నిలవలేదు. యాసిర్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూగా పెవీలియన్ చేరాడు. తర్వాతి ఓవర్లోనే మాక్రమ్ సైతం నౌమన్ అలీ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. కేవలం 10 పరుగుల వ్యవధిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన కేశవ్ మహారాజ్(2), క్వింటన్ డి కాక్(0) మరో వికెట్ పడకుండా మూడో రోజు ఆట పూర్తి చేశారు. ఆట ముగిసేసరికి సౌతాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి, 29 పరుగుల ఆధిక్యంలో ఉంది. యాసిర్ షా 3 వికెట్లు తీయగా, నౌమన్ అలీ ఒక వికెట్ తీశాడు.
సంక్షిప్త స్కోరు బోర్డు:
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 220 ఆలౌట్
పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్: 378 ఆలౌట్
సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 187/4*