- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పద్మశ్రీ కనకరాజుకు సాంస్కృతిక మంత్రి సత్కారం
దిశ, క్రైమ్ బ్యూరో : ఆదివాసీ నృత్యం గుస్సాడీని కొత్త తరానికి అందిస్తున్న కనకరాజుకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి హర్షం వ్యక్తం చేయడమే కాకుండా, బుధవారం రవీంద్రభారతిలో కనకరాజుకు ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రాచీనమైన గుస్సాడీ నృత్యంపై మైదాన ప్రాంత ప్రజలకు అవగాహన తక్కువ ఉంటుందన్నారు.
ప్రస్తుత రోబోటిక్ యుగంలోనూ ప్రాచీన కళగా పేరుగాంచిన గుస్సాడీ నృత్యం తరతరాలుగా కొనసాగుతుండటం అభినందనీయమన్నారు. గుస్సాడీ నృత్యానికి మెరుగులు దిద్దుతూ నేటి తరానికి శిక్షణ అందిస్తున్న కనకరాజు దేశం గర్వించదగ్గ గొప్ప కళాకారుడని మంత్రి కొనియాడారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున కళాకారులకు అందించే ప్రత్యేక పెన్షన్ రూ.10 వేలు అందేలా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ, కనకరాజు బృందం సభ్యులు పాల్గొన్నారు.