- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణకు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ వచ్చేస్తోంది
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఆక్సిజన్ ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ముమ్మరమవుతున్నాయి. ఇప్పటికే ఒడిశా నుంచి ట్యాంకర్లలో రోడ్డు మార్గాన ఆక్సిజన్ తీసుకువచ్చారు. ఇప్పుడు రైల్వే నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లు ఒడిశాలోని అన్గుల్ స్టేషన్‌కు పంపించారు. గురువారం ఉదయమే ఈ రైలు రాష్ట్రం దాటింది. సికింద్రాబాద్ నుంచి ఐదు ఖాళీ ట్యాంకర్లను తీసుకువెళ్లిన రైలు ఉదయం 10 గంటల ప్రాంతంలోనే సరిహద్దులోని సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్ దాటింది. ఇవ్వాళ రాత్రి వరకు అన్గుల్ స్టేషన్‌కు ఈ రైలు చేరుకుంటుందని, రేపు ఉదయం ట్యాంకర్లలో ఆక్సిజన్ తీసుకుని మళ్లీ ట్యాంకర్లను ఎక్కించుకుని రైలు అక్కడి నుంచి వస్తుందని రైల్వే అధికారులు వెల్లడించారు. శనివారం వరకు ఈ రైలు రాష్ట్రానికి రానుంది. తర్వాత మళ్లీ సమయానుకూలంగా ఈ రైలు ఆక్సిజన్ ట్యాంకర్లతో ఒడిశాకు పంపించనున్నారు.
కాగా రైల్వే అండర్ బ్రిడ్జిలు, సాంకేతిక అంశాలన్నీ పరిశీలించుకుని 3.5 మీటర్ల నుంచి 4 మీటర్ల ట్యాంకర్లు ఐదింటిని ఒడిశాకు పంపించారు. ఒక్కో ట్యాంకర్లో 15 మెట్రిక్ టన్నులు దాటి ఆక్సిజన్ ఎక్కించనున్నారు. మొత్తం 60 నుంచి 65 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ శనివారం వరకు రాష్ట్రానికి రానుంది. ఇక్కడకు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించనున్నారు. ఆ తర్వాత ప్రధానాస్పత్రులు, జిల్లా ఆస్పత్రులకు ఆక్సిజన్‌ను సరఫరా చేయనున్నారు. రాష్ట్రంలో తీవ్ర కొరత ఉన్న నేపథ్యంలో ఆక్సిజన్ సరఫరాకు అటు రైల్వే, ఇటు ఆర్టీసీని వినియోగిస్తున్నారు.