ఈ ఏడాది భారత జీడీపీ అంచనాను తగ్గించిన ఆక్స్‌ఫర్డ్ ఎకనమిక్స్

by Harish |
ఈ ఏడాది భారత జీడీపీ అంచనాను తగ్గించిన ఆక్స్‌ఫర్డ్ ఎకనమిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 సెకెండ్ వేవ్ నేపథ్యంలో భారత వృద్ధి రేటు అంచనాలను తగ్గిస్తున్న ఏజెన్సీల సంఖ్య పెరుగుతోంది. తాజాగా అంతర్జాతీయ సంస్థ ఆక్స్‌ఫర్డ్ ఎకనమిక్స్ సోమవారం ప్రస్తుత ఏడాదికి భారత జీడీపీ అంచనాను ఇదివరకు వెల్లడించిన 11.8 శాతం నుంచి ఏకంగా 10.2 శాతానికి తగ్గిస్తున్నట్టు తెలిపింది. దేశంలో తీవ్రంగా పెరుగుతున్న కరోనా వల్ల ఆరోగ్య రంగంపై భారం అధికంగా ఉంటుందని, టీకా సంబంధిత అంశాలు, మహమ్మారిని నియంత్రించడంలో ప్రభుత్వం సరైన వ్యూహాన్ని అనుసరించకపోవడం వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని వృద్ధి రేటును సవరించినట్టు నివేదిక అభిప్రాయపడింది.

రెండో త్రైమాసికంలోనూ జీడీపీ వృద్ధి కుదించుకుపోయే అవకాశం ఉందని తెలిపింది. మహారాష్ట్రలో విధించిన స్థాయిలో ఇతర రాష్ట్రాల్లోనూ కఠిన లాక్‌డౌన్ విధిస్తే గనక మరోసారి వృద్ధి అంచనాను తగ్గిస్తామని నివేదిక పేర్కొంది. అధికారిక మరణాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ, వేగంగా పెరుగుతున్న మరణాల సంఖ్య ఆందోళనకరంగా ఉందని ఆక్స్‌ఫర్డ్ ఎకనమిక్స్ నివేదిక వివరించింది. కాగా, ప్రస్తుత ఏడాదికి సంబంధించి భారత వృద్ధి రేటును అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఐఎంఎఫ్ 12.5 శాతంగా అంచనా వేసింది. రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్‌పీ 11 శాతంగా అంచనాలను వెల్లడించింది

Advertisement

Next Story

Most Viewed