- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వంటగదిలో ఉన్నదెవరు?
దిశ, వెబ్‌డెస్క్: ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అనే ప్రశ్న మాదిరిగానే మొన్న సాయంత్రం నుంచి ‘రసోడే మే కౌన్ థా? (వంటగదిలో ఉన్నదెవరు?)’ అనే ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సమాధానం రాశి. ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతున్న మీమ్ ఇది. ఇదేదో డిటెక్టివ్ సీరియల్‌కు సంబంధించిన వైరల్ మీమ్ అనుకునేరు.. అస్సలు కాదు. ఇదొక ర్యాప్ సాంగ్. ఏదో డైలాగ్‌లాగా ఉందే.. ర్యాప్ సాంగ్ అంటున్నారు ఏంటా అని అనుకోవద్దు. పూర్తి కథను సింపుల్‌గా చెప్పాలంటే గతంలో స్టార్ మా చానల్‌లో టెలికాస్ట్ అయిన ‘కోడలా కోడలా కొడుకు పెళ్లమా’ అనే డబ్బింగ్ సీరియల్ గురించి తెలియాలి. అలాగే యశ్‌రాజ్ ముఖటే అనే మ్యూజిక్ ప్రొడ్యూసర్ గురించి కూడా తెలియాలి. ఈ సీరియల్ ఏంటి? ఈ రాశి ఎవరు? ఈ యశ్‌రాజ్ ఎవరు? ఇవన్నీ తెలియాలంటే ఇది చదవాలి.
మహారాష్ట్రకు చెందిన యశ్‌రాజ్ ముఖటే ఒక మ్యూజిక్ డైరెక్టర్. బాణీలు కట్టడం, పాటలు రాయడం, పాడటం ఇలా సకలకళావల్లభుడు అని చెప్పుకోవచ్చు. సాధారణంగా సెలెబ్రిటీల డైలాగ్స్, వైరల్ వీడియోల్లో మాట్లాడిన మాటలకు కొంత మ్యూజిక్ టెక్నాలజీ జోడించి యశ్‌రాజ్ కొత్త పాటను సృష్టిస్తుంటాడు. అలా ఫన్నీగా వీడియోలు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతుంటాడు. ఈ మధ్య అలాంటి ఒక వీడియోను యశ్‌రాజ్ అప్‌లోడ్ చేశాడు. ఇందులో ‘సాథ్ నిబానా సాథియా (కోడలా కోడలా కొడుకు పెళ్లమా)’ సీరియల్‌లో కోకిల బెన్ డైలాగ్‌లకు ర్యాప్ సంగీతాన్ని జోడించాడు. అంతే.. ఆ ట్యూన్ చాలా క్యాచీగా ఉండటంతో ఓవర్ నైట్‌లో పాపులర్ అయిపోయింది. ఎంతలా అంటే ఆ వీడియోను స్మృతి ఇరానీ కూడా షేర్ చేశారు. ఈ ర్యాప్ వీడియోను ఒక్క సారి చూశారంటే.. చూస్తూనే ఉంటారు. ఇక ఆ లిరిక్స్ మెదడులో చిక్కుకుని ఎక్కడికీ వెళ్లవు. అలా పాడుతూనే ఉంటారు.
ఈ వీడియో తర్వాత యశ్‌రాజ్ ఫాలోవర్లు భారీగా పెరిగారు. ఇక సెలెబ్రిటీలు, కమెడియన్‌లు ఈ వీడియోను షేర్ చేస్తూనే ఉన్నారు. ఈ సీరియల్‌లో కోకిల బెన్‌గా నటించిన రూపల్ పటేల్ స్వయంగా యశ్‌రాజ్‌కు కాల్ చేసి మెచ్చుకున్నారు. ఇక మీమ్ వేసేవాళ్లు పండగ చేసుకుంటున్నారు. రాశి ఏం తప్పు చేసింది? కోకిలా బెన్ ఎందుకిలా ర్యాప్ చేసింది? అంటూ ఈ వైరల్ వీడియోను మీమ్‌లు వేస్తున్నారు. ఒక్కసారిగా రాశి సెలెబ్రిటీ అయిందని, ఆ సీరియల్ వల్ల కూడా ఇంత పాపులారిటీ వచ్చి ఉండదని కామెంట్‌లు చేస్తున్నారు. మీరు కూడా ఆ వీడియోను చూసేయండి మరి!
View this post on Instagram
A post shared by Yashraj Mukhate (@yashrajmukhate) on Aug 20, 2020 at 8:51am PDT