- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మమ్మల్ని తీసేయకండి.. సిద్దిపేటలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన
X
దిశ, సిద్దిపేట: కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి రోగులకు సేవలు చేసిన తమను ఇప్పటికిప్పుడు ఉద్యోగాల నుంచి తొలగించడం సబబు కాదని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. కార్మికులకు మద్దతుగా బీజేపీ నాయకులు ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. రాత్రికి రాత్రే తమకు ఫోన్ చేసి నేటి నుంచి డ్యూటీలకు రావద్దని తెలిపారని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు కూడా చెల్లించలేదని వాపోయారు. తమను ఉద్యోగాల నుంచి తొలగించకుండా, తిరిగి నియమించుకోవాలని డిమాండ్ చేశారు. కొవిడ్ సమయంలో తమ ప్రాణాలకు రక్షణ లేకుండా, కుటుంబాలని వదిలి సేవ చేశామని గుర్తు చేశారు. ఈ వ్యవహారంపై మంత్రి హరీష్ రావు చొరవ తీసుకొని సమస్యలు పరిష్కరించాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కోరారు.
Advertisement
Next Story