పర్యావరణ పరిరక్షణ మా పార్టీ మూల సిద్ధాంతం: పవన్ కల్యాణ్

by srinivas |
Pawan
X

దిశ, ఏపీ బ్యూరో: పర్యావరణ పరిరక్షణ తమ పార్టీ మూల సిద్ధాంతమని ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మానవ జాతి సౌభాగ్యానికి పర్యావరణమే మూలమని, మానవ మనుగడకు పంచభూతాలే ఆధారమన్నారు. అలాంటి పంచభూతాలను కాపాడుకుందామని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. నింగి, నీరు, నేల, నిప్పు, గాలితో సమ్మిళితమైన పర్యావరణాన్ని పరిరక్షించుకున్నప్పుడే మానవజాతి శోభిల్లుతుందని చెప్పారు. మన ఆరోగ్యం పర్యావరణంతోనే ముడిపడి ఉందని చెప్పారు. చక్కటి పర్యావరణం ఉన్న చోట ఆసుపత్రుల అవసరం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed