- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
దిశ, సినిమా: ఈ మధ్య కొత్త సినిమాలు అన్నీ నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. మరికొన్ని టైమ్ తీసుకున్నప్పటికీ ఓటీటీలో రికార్డు సృష్టిస్తున్నాయి. తాజాగా, మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ ‘ఆహా’ సినిమా మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కుల్ని ప్రముఖ సంస్థ ఆహా సొంతం చేసుకోగా.. సెప్టెంబర్ 12 నుంచి తెలుగులో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది.
ఈ విషయాన్ని ఆహా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. ‘‘టగ్ ఆఫ్ వార్ కి రెడీగా ఉండండి! ఆట మొదలెట్టాక, అటో ఇటో తేలిపోవాల్సిందే!! సెప్టెంబర్ 12 నుంచి ‘ఆహా’ స్ట్రీమింగ్ కాబోతుంది’’ అనే క్యాప్షన్ జత చేశారు. అయితే 2021లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించి మూడేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ఈ చిత్రానికి బిబిన్ పాల్ శామ్యూల్ దర్శకత్వం వహించగా.. ఇంద్రజిత్ సుకుమారన్, అమిత్, అశ్విన్ కుమార్, మనోజ్ జయన్, శాంతి బాల చంద్రన్ వంటి వారు కీలక పాత్రలో నటించారు. అయితే మలయాళంలో వచ్చిన ఈ సినిమాను ఆహా మూడేళ్ల తర్వాత తెలుగులో స్ట్రీమింగ్ చేయబోతుండటం విశేషం.