అఖిల్ ‘ఏజెంట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. కానీ ఫ్యాన్స్‌కు ట్విస్ట్ ఇచ్చిన సంస్థ..!

by Hamsa |
అఖిల్ ‘ఏజెంట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. కానీ ఫ్యాన్స్‌కు ట్విస్ట్ ఇచ్చిన సంస్థ..!
X

దిశ, సినిమా: అక్కినేని హీరో అఖిల్, సురేందర్ రెడ్డి కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’. ఈ మూవీ గత ఏడాది ఏప్రిల్ 28న థియేటర్స్‌లో విడుదల అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ మూవీ కోసం అక్కినేని వారసుడు ఎంత కష్టపడినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఏజెంట్ తర్వాత స్టార్ హీరో అవుతాడనుకుంటే.. ఇండస్ట్రీకి దూరం అయ్యే పరిస్థితి నెలకొంది. ఇక ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో అఖిల్ గత కొద్ది కాలం నుంచి సినిమాలు చేయడం లేదు. అయితే ఏజెంట్ థియేటర్స్‌లో రిలీజ్ అయినప్పటికీ ఓటీటీలోకి మాత్రం రాలేదు.

దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఈ మూవీ కోసం గత 15 నెలల నుంచి వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. ఇటీవల ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లీవ్ ‘ఏజెంట్’ సెప్టెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అధికారిక ప్రకటనను విడుదల చేసింది. దీంతో ఫ్యాన్స్ అంతా ఆనందపడ్డారు. కానీ ఆ సంతోషం కొద్ది రోజులు కూడా నిలవలేదు. తాజాగా, అఖిల్ ఏజెంట్ స్ట్రీమింగ్ డేట్ పోస్టులను సోనీ లివ్ సంస్థ తొలగించి షాకిచ్చినట్లు సమాచారం. దీంతో అంతా షాక్ అవుతున్నారు. అసలు ప్రీమియర్ పోస్టర్‌లను ఈ సంస్థ చివరి నిమిషంలో డిలీట్ చేయడానికి కారణాలేంటని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. అసలు ఏజెంట్ ఓటీటీలో విడుదల చేయరా అని అనుమాన పడుతున్నారు.



Next Story