నో పర్మిషన్.. ఓన్లీ ఇన్ ఫర్మేషన్

by vinod kumar |
నో పర్మిషన్.. ఓన్లీ ఇన్ ఫర్మేషన్
X

దిశ, నిజామాబాద్: ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్నందునా.. రాష్ట్రమంతటా ఒకలా ఉంటే.. ఇక్కడ మాత్రం పరిస్థితి వేరే ఉంది. ఇదేంటనీ ఆరా తీస్తే పర్మిషన్ లేదు కానీ, ఇన్ఫర్మేషన్ ఉందని వారు అంటున్నట్లు తెలుస్తోంది. అదేంటో మీరే చూడండి.

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కల్తీ కల్లు బాధితులు గత రెండు రోజుల నుంచి ఒక్కరు కూడా ఆసుపత్రులకు రాలేదు. నిజామాబాద్ జనరల్ అసుపత్రిలోని ప్రత్యేక వార్డు, కామారెడ్డి జిల్లా అసుపత్రిలో ప్రత్యేక వార్డులు, బోధన్, బాన్సువాడలలోని సర్కారు ఆసుపత్రులు మొన్నటి వరకు కల్తీ కల్లు బాధితులతో నిండిపోయాయి. ఒకవేళ వచ్చినా కూడా మందుగోలీలు, బిల్లులను చేతిలో పెట్టి ఇంటికి పంపిస్తున్నారని ఎవరూ ఆసుపత్రులకు రావడంలేదు. దీంతో పోలీసులకు కల్లు దుకాణాల వద్ద లాఠీలకు పని చెప్పాల్సిన పనిలేకుండా పోయింది. కేవలం ఎర్రగడ్డ ఆసుపత్రికి మాత్రమే ఈ తాకిడి పెరిగిందని సమాచారం. దీనిపై విషయమేంటని ఆరా తీస్తే.. గుట్టు చప్పుడు కాకుండా కల్తీ కల్లు దుకాణాలు మళ్లీ తెరిచిన్రు అని తెలుస్తోంది.

పట్టించుకోకుండా..

లాక్ డౌన్ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు బార్లు, క్లబ్ లు, టూరిజం బార్లు, లిక్కర్ ఎ 4 షాపులు, కల్లు దుకాణాలను తెరవకూడదని ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఇక్కడ ఆ నిబంధనలను పట్టించుకోకుండా గుట్టు చప్పుడు కాకుండా కల్లు దుకాణాలు నడుపుతున్నారు. పర్మిషన్ లేదు కానీ, ఇన్ ఫర్మేషన్ తో వారు కల్లు దుకాణాలు నడుపుతున్నట్లు సమాచారం. నగరం, పట్టణాలు, మండల కేంద్రాలలో ఉన్న సోసైటీ అనుబంధ డిపోలు మూసి వేసిన గ్రామాల వారీగా ఉన్న సోసైటీలు మాత్రం యథావిధిగా తెరిచారు. అక్కడి నుంచి గ్రామాలకు, పట్టణాలకు కల్లు సరఫరా చేస్తున్నారు. మద్యం బాధితుల కోసం వారి కుటుంబాలు బ్లాక్ లో రెండింతల ధరలకు ఛీప్ లిక్కర్ ల నుంచి బ్రాండెడ్ విస్కీల వరకూ కొనుగోలు చేసి వారిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

మూల్యం చెల్లించారు..

లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి కల్లు తయారీ అడ్డాలు( డిపోలు) మూతపడ్డాయి. కల్తీ కల్లుకు అలవాటుపడినవారు మాత్రం అందుకు తగిన మూల్యం చెల్లించారు. ఉమ్మడి జిల్లాలో పదిమంది వరకు చనిపోగా (అనధికారిక లెక్కల ప్రకారం), పదుల సంఖ్యలో ఆసుపత్రుల పాలయ్యారు. కల్తీకల్లు బాధితుల కోసం కుటుంబాలు లాక్ డౌన్ లో తీవ్రమైన కష్టాలను ఎదుర్కొన్నారు. సమాజంలో ఉన్నపేరు ప్రతిష్టలను ఒక్క లాక్ డౌన్ లో కల్లు దొరక్కపోతే వారు చేసిన హంగామాతో రోడ్డునపడ్డాయి. వారికి కల్లు కోసం గ్రామాలకు గ్రామాలను దాటి చేయని సాహసం లేదు. కల్తీకల్లు రుచి సహజ సిద్ధమైన ప్రకృతి ప్రసాదించిన చెట్ల కల్లులా లేకపోవడం వారి బాధలను వర్ణణాతీతం చేశాయి.

చుక్కలు చూపించారు..

క్లోరోఫాం, డైజోఫాం, అల్ఫాజోలం లాంటి రసాయనాలు, యూరియా, చక్రిన్ లాంటి తీపి పదార్థాల తయారీ కల్తీకల్లు రుచి, దానిని సేవించడం ద్వారా వచ్చే కిక్కు దొరకక కల్తీకల్లు ప్రియులు 2012 తరువాత అక్షరాల 8 సంవత్సరాల తరువాత జిల్లా ప్రజలకు పట్ట పగలు చుక్కలు చూపించారు. జిల్లాలో కల్తీ కల్లు బాధితులను ఎలా కట్టడి చేయాలో తెలియక అధికార యంత్రాంగాలే కల్లు బట్టీలను తెరిపించి మందు కల్లును అమ్మించిన ఘటనలు ఉన్నాయి. గ్రామాలల్లో కల్లు డిపోలు తెరిచి వాటి ద్వారా తయారీ కల్లును బట్టీలకు తరలించి అమ్మకాలు చేస్తున్నారు. ప్రజలు అక్కడికి పెద్ధ ఎత్తున వస్తే అక్కడ కరోనా విస్తరిస్తదని ప్యాకెట్ లలో సరఫరా చేస్తున్నారు. మందుల తయారీతో అయ్యే కల్తీ కల్లు మాటున తయారవుతున్న కల్లును పట్టించుకోవడం లేదు అనే విమర్శలు ఉన్నాయి.

రాకమానదు..

కల్తీ మద్యం, కల్తీ సారా, గుడుంబా వల్ల ఎవరైనా ప్రజలు చనిపోతే కేసులు నమోదు చేసే ఆబ్కారీ, పోలీస్ శాఖలు కల్తీ కల్లు కేసులను ఎందుకు పట్టించుకోరా అనే అనుమానాలు రాకమానదు. వారు కేవలం రికార్డుల కొరకు మాత్రమే కేసులను నమోదు చేస్తారనడానికి జిల్లాలో కల్తీ కల్లు మరణాలు, వారు అడ్మిట్ ఐనా కేసులను పట్టించుకోవడం లేదన్నది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. సుమోటోగా కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నా కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాత్రం అవి కనిపించవు. సొసైటీల ద్వారా నడిచే కల్లు డిపోల పరిధిలో ఉన్న ఈత, తాటి చెట్లకు కల్లు తయారీకి పొంతనే ఉండదు. ప్రజలను మత్తు కల్లుకు బానిసలను చేసి వాటి ద్వారా కొందరు రూ. కోట్లకు పడగలెత్తుతుంటే సామాన్యులు.. కూలీనాలీ చేసుకునేవారు మాత్రం సమీదలవుతున్నారు.

దాఖలాలు లేవు..

జిల్లాలో కల్తీ కల్లు విషయంలో ఏ ఒక్క ఎక్సైజ్ అధికారి స్పందించిన దాఖలాలు లేవు. వారు రికార్డుల కొరకు మాత్రమే డిపోలను తనిఖీ చేశారు. కానీ, కల్తీ కల్లు తయారీపై శీతకన్ను వేశారనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పడు ఏకంగా అబ్కారీ శాఖ కమిషనర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రజలను మళ్లీ కల్తీకల్లు బానిసలను తయారు చేసే డిపోలు గ్రామాలలో తెరిచారు. కానీ, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడంలేదు. దీంతో ఆబ్కారీశాఖపై ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.

ఆదాయం తెచ్చే..

ఆబ్కారీ శాఖకు చిన్నస్థాయిలో ఆదాయం తెచ్చే కల్లు సొసైటీలు అధికారులకు మాత్రం బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటివని అందుకే వాటి విషయంలో చూసి చూడనట్లు వ్యవహరిస్తారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కరోనా విస్తరణలో ఉక్కిరి బిక్కిరి అవుతున్న అధికారయంత్రాంగం కల్లు బాధితుల గోల తమకు ఎందుకు అని కల్తీ కల్లు కోసం బాధితులు నానా యాగీచేస్తుండటంతో పట్టించుకోవద్ధని మౌకిక ఆదేశాలు ఉన్నాయని కల్లు సొసైటీల నిర్వాహకులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.

Tags : Nizamabad, white water, officials, reopened No permissions

Next Story

Most Viewed