- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జిరాఫీకి జీపీఎస్ ట్రాకింగ్..ఎందుకో తెలుసా..
దిశ, వెబ్‌డెస్క్: అరుదైన వాటికి మార్కెట్లో విలువ ఎక్కువ. అవి ఆభరణాలైనా, జంతువులైనా. అందుకే అరుదుగా కనిపించే జంతువులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఇలాంటి అరుదైన జంతువుల్లో ఒకటైన తెల్ల జిరాఫీని కాపాడే యోచనలో భాగంగా దానికి జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ అమర్చారు. ఈశాన్య కెన్యాలో అక్రమంగా జంతువులను రవాణా చేసే వారి నుంచి ఈ ఒకే ఒక్క తెల్ల జిరాఫీని కాపాడటానికి ఇషక్‌బిని హీరొలా కమ్యూనిటీ కన్సర్వెన్సి వారు ఈ ట్రాకింగ్ అమర్చారు. గతంలో దీనితో పాటుగా ఉండే రెండు తెల్ల జిరాఫీలను కొందరు చంపేయడంతో ఇప్పుడు ప్రపంచంలో ఇదొక్కటే తెల్ల జిరాఫీ మిగిలింది.
లూసిజం అనే జన్యుసంబంధ స్థితి కారణంగా చర్మంలో రంగు కణాలు అభివృద్ధి చెందక జంతువులు ఇలా పూర్తిగా తెలుపు రంగులో ఉంటాయి. ఈ మగ తెల్ల జిరాఫీ కొమ్ముల్లో నవంబర్ 8న జీపీఎస్ ట్రాకర్‌ను ఏర్పాటు చేసినట్లు కన్సర్వెన్సి ప్రతినిధులు తెలిపారు. ఈ ట్రాకర్ ద్వారా జిరాఫీ స్థానానికి సంబంధించి ప్రతి గంటకూ ఒకసారి అప్‌డేట్ వస్తుంది. దీని వల్ల అడవిలో జిరాఫీ ఎక్కడ ఉందనేది రేంజర్లకు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ మధ్య కురిసిన వర్షాలకు ఈ జిరాఫీ తిరిగే ప్రదేశంలో పెద్ద మొత్తంలో పచ్చిగడ్డి కూడా పెరగడంతో దీని ఆరోగ్యం గురించి ఎలాంటి బెంగ లేదు… కానీ, అక్రమంగా జంతువులను రవాణా చేసే వారితోనే అసలైన సమస్య ఎదురవుతుంది కాబట్టి తాము ఇలా ట్రాకర్ అమర్చినట్లు హీరొలా కమ్యూనిటీ ప్రతినిధులు వెల్లడించారు.