ఆ గ్రామంలో ఆడపిల్లలు మాత్రమే పుడుతారంటా.. ఎందుకో తెలుసా?

by Shyam |
ఆ గ్రామంలో ఆడపిల్లలు మాత్రమే పుడుతారంటా.. ఎందుకో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : ఆడపిల్ల పుడితే చాలు ఏ చెత్తకుప్పల్లోనో, చెట్లపొదలలోనో పారేస్తున్న రోజులివి. ఈ కాలంలో ఎవరిని చూసినా నాకు ఒక కొడుకు ఉంటే చాలు అనుకుంటున్నారు తప్ప ఆడపిల్ల పుట్టినా మగపిల్లాడిలా దైర్యంగా పెంచుతాము అని అనుకొనే తల్లిదండ్రులు చాలా తక్కువ. దీనివలనే రోజు రోజుకు ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ఆడపిల్ల అంటే ఇంటికి లక్ష్మీ.. ప్రతి ఇంటికీ దీపం ఆడపిల్ల . ఆడపిల్ల లేని ఇల్లు తులసిమొక్క లేని కోటలా ఉంటుంది. ఇంటికీ ఒక ఆడపిల్ల ఉంటేనే అందంగా ఉంటే గ్రామమంతా ఆడపిల్లలతో కళకళలాడుతుంటే… అవును ఆ గ్రామంలో ఒక్క మగ పిల్లడు కూడా ఉండడు. అందరు ఆడపిల్లలే. ఆ విచిత్రమైన గ్రామం గురించి తెలుసుకుందామా?

అది పోలాండ్, చెక్ రిపబ్లిక్ సరిహద్దులోని గ్రామం. పేరు మిజ్స్కే ఓడ్రేజ్ స్కీ. ఇక్కడ 10 ఏళ్లుగా ఆడపిల్లలు మాత్రమే పుడుతున్నారు. మచ్చుకైనా ఒక మగపిల్లాడు కూడా పుట్టలేదంటే అతిశయోక్తి కాదు. దశాబ్దం పాటు అక్కడ ఆడపిల్లు తప్ప ఒక్క మగపిల్లవాడు కూడ పుట్టలేదు. దీంతో ఆగ్రామం చర్చనీయాంశమైంది. అందరి మనసులో ఉన్న ఒకే ప్రశ్న.. ఈ గ్రామంలో ఆడపిల్లలు మాత్రమే ఎందుకు పుడుతున్నారు? మగపిల్లలు ఎందుకు పుట్టటంలేదు అని..ఈ మిస్టరీని ఛేదించటానికి చాలా ప్రయత్నాలు జరిగాయట. కానీ పెద్దగా ఫలితాలేవీ రాలేదని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో అక్కడి స్థానిక ప్రభుత్వం ఆ గ్రామంలో మగపిల్లాడు పుడితే ఆ తల్లిదండ్రులకు బహుమతి ఇస్తామని ప్రకటించింది. దీని బట్టి ఆగ్రామం పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో ఆ గ్రామంలో మగపిల్లాడు పుట్టాలని మొక్కని దేవుడు లేడు.. చేయని పూజ లేదు. అయితే ఎన్ని పూజల ఫలితమో తెలియదు కానీ ఎట్టకేలకు ఆ గ్రామంలో మగ పిల్లవాడు జన్మించాడు దీంతో ఆ కుటుంబమే కాకుండా ఆ ఊరంతా సంబరాలు చేసుకున్నారు.

Advertisement

Next Story