- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉత్పత్తికే కాదు.. గనుల్లో సేఫ్టీకీ టెక్నాలజీ అవసరం
దిశ, న్యూస్‌బ్యూరో: టెక్నాలజీని అధిక ఉత్పత్తికి మాత్రమే కాకుండా పనిచేసే కార్మికుల రక్షణకు కూడా వినియోగిస్తూ ఉత్పత్తి లక్ష్యాలను సాధించాల్సి ఉందని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్ అండ్ పా)ఎస్. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలోని మైనింగ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం నుంచి వారంరోజుల పాటు నిర్వహిస్తున్న ఆన్‌లైన్ ఫ్యాకల్టీ ట్రైనింగ్ కాన్ఫరెన్స్‌లో చంద్రశేఖర్ గౌరవ అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో డంపులు, ఏటవాలు స్లోపుల పటిష్టత, స్థిరీకరణ, సమస్యలు- పరిష్కారమార్గాల అంశంపై జాతీయ సదస్సును నిర్వహించారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో క్వారీల్లో ఉన్నట్లుగా తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఏర్పడే స్లోపులు, తవ్విపోసిన మట్టితో ఏర్పాటు చేసే డంపులు కిందకు జారకుండా స్థిరీకరించే చర్యలపై మైనింగ్ నిపుణులు పాల్గొని చర్చించనున్నారు.
మొదటిరోజు సదస్సులో డైరెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ సింగరేణిలో తమ అనుభవాల ఆధారంగా స్లోపులు, డంపుల నిర్వహణ ఎలా ఉండాలో వివరించారు. అత్యంత కచ్చితమైన సమాచారం పొందేందుకు దేశంలోనే తొలిసారిగా లైడార్ ఆధునిక పరికరాలు కొనుగోలు చేసి వినియోగిస్తున్నామన్నారు. వీటితో పాటు డంపులు స్లోపుల లోపల నిర్వహణను ఖచ్చితమైన పద్ధతిలో ఆచరించేందుకు మై నెక్స్ వంటి ఈ-మాడ్యూల్స్‌ను వాడుతున్నామని తెలిపారు. సింగరేణిలో పాటిస్తున్న ఈ పద్ధతులు విజయవంతం అయ్యాయని చెప్పారు. రక్షణకు సింగరేణి సంస్థ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఆధునిక పరికరాలను సమకూర్చుకొని రక్షణతో కూడిన ఉత్పత్తి సాధిస్తోందని పేర్కొన్నారు.
సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ సేఫ్టీ( సౌత్ సెంట్రల్ జోన్) మలై టీకేదార్ మాట్లాడుతూ గనుల్లో జరుగుతున్న ప్రమాదాల్లో 10శాతం అడ్డం పులుసు స్థిరీకరణ లోపల జరుగుతున్నాయని తెలిపారు. ఇటువంటి సదస్సులు మరిన్ని నిర్వహించడం ద్వారా రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్ సేఫ్టీ మహ్మద్ నియాజీ ప్రసంగించారు. ఈ ఫ్యాకల్టీ శిక్షణ కార్యక్రమం మైనింగ్ అధ్యాపకులకే కాకుండా విద్యార్థులకు, మైనింగ్ కంపెనీలకు కూడా ఎంతో ఉపయోగకరం కానుందని మల్లారెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. రవీంద్ర అన్నారు. సదస్సులో సింగరేణి సంస్థ నుంచి పలువురు మైనింగ్ ఇంజనీర్లతో పాటు సీ.ఐ.ఏ గ్లోబల్ వెంచర్, మిడ్వెస్ట్ గ్రానైట్ , ఐటీఐ ధన్‌బాద్, ఎన్‌ఐటీ రూర్కెలా ఎన్‌ఐటీ సురత్కల్, జెఎన్‌టీయూ (హెచ్), ఉస్మానియా యూనివర్సిటీ, జెసీబీఐటి, కొత్తగూడెం పాలిటెక్నిక్ కళాశాలల నుంచి ఫ్యాకల్టీ , కోఆర్డినేటర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం ఎస్.వెంకట్రామయ్య, హెచ్ఆర్ జీఎం రామలింగేశ్వరుడు, పలువురు మైనింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.